నాలుగు రోజుల తర్వాత హైద్రాబాద్‌కు శరత్ మృతదేహం: కుటుంసభ్యులకు మంత్రుల పరామర్శ

First Published Jul 8, 2018, 12:30 PM IST
Highlights

అమెరికాలోని కేన్సస్‌లో జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన శరత్ మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులను డిప్యూటీసీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఆదివారం నాడు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం ప ్రకటించింది.


హైదరాబాద్: కేన్సస్‌లో దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన శరత్ భౌతిక కాయం హైద్రాబాద్‌కు రప్పించేందుకు కనీసం నాలుగు రోజులకు పైగా పట్టే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కెటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఆదివారం నాడు శరత్ కటుంబసభ్యులను పరామర్శించారు.

అమెరికాలోని కేన్సస్‌లో శరత్ ను దుండగుడు కాల్చి చంపారు. ఈ విషయం తెలిసిన వెంటనే శరత్ తండ్రి  రామ్మోహన్ రావు తల్లి మాలతీ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శరత్ తల్లిదండ్రులను ఓదార్చే పరిస్థితి లేకుండా పోయింది.  

ఆరు మాసాల క్రితమే అమెరికాకు శరత్ వెళ్లాడు.  అమెరికా నుండి తన సోదరి పెళ్లి కోసం వస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో మృత్యువాత పడడంతో కుటుంబసభ్యులు రోధనలు మిన్నంటాయి.

ఆదివారం నాడు  ఉదయం తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు  కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు  శరత్ కుటుంబసభ్యులను ఓదార్చారు. అమెరికాకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేస్తామని కూడ మంత్రి కేటీఆర్ హమీ ఇచ్చారు. హైద్రాబాద్‌లోని అమెరికా ఎంబసీ అధికారులతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు.

అమెరికాలోని షికాగో లోని ఎంబసీ అధికారులతో కూడ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. శరత్ మృతదేహాం హైద్రాబాద్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అయితే శరత్ ను హత్య చేసినందున ఆ ఫార్మాలీటీస్ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని  అమెరికా అధికారులు తనకు చెప్పారని కేటీఆర్ తెలిపారు..ఈ ఫార్మాలిటీస్ పూర్తైన తర్వాత డెడ్‌బాడీని హైద్రాబాద్‌కు పంపేందుకు చర్యలు తీసుకొంటామని అధికారులు చెప్పారన్నారు.

అయితే శని, ఆదివారాలు అమెరికాలో వరుస సెలవు దినాలు కావడంతో మృతదేహాం  హైద్రాబాద్‌కు రప్పించేందుకు నాలుగు రోజులు పట్టే అవకాశం లేకపోలేదని కేటీఆర్ తెలిపారు. 

అమెరికాలో ఉన్న వారు కూడ శరత్ మృతదేహంతో పాటు హైద్రాబాద్‌ను రప్పించేందుకు  చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారు. శరత్ మృతదేహాన్ని హైద్రాబాద్‌ తీసుకొచ్చేందుకు  తాము అమెరికాకు వెళ్లే పరిస్థితిలో లేమని శరత్ తండ్రి రామ్మోహన్ రావు చెప్పారు.

శరత్ మృతదేహాన్ని హైద్రాబాద్ కు రప్పించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకొంటున్నట్టు మంత్రి కేటీఆర్ తమకు చెప్పినట్టు ఆయన తెలిపారు. తన కొడుకు మృతదేహాన్ని హైద్రాబాద్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

శరత్ మృతదేహం వద్ద ఫార్మాలిటీస్‌ను తమ బంధువు చూస్తున్నట్టు రామ్మోహన్ రావు చెప్పారు. తన స్నేహితుడి కొడుకు కూడ సంఘటనా స్థలం వద్దకు చేరుకొంటున్నాడని ఆయన చెప్పారు. శరత్ స్నేహితులు కూడ  తమతో ఫోన్‌లో, వాట్సాప్‌లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని ఆయన  చెప్పారు.

click me!