కేసీఆర్ కి మరో షాక్.. మరో సీనియర్ రాజీనామా..?

Published : Oct 24, 2018, 03:15 PM IST
కేసీఆర్ కి మరో షాక్.. మరో సీనియర్ రాజీనామా..?

సారాంశం

ఉద్యమ సమయంలో రాత్రి, పగలు కష్టపడి కేసీఆర్‌తో కలిసి తెలంగాణ సాధించాం. అంత చేసినా నాకు పార్టీ న్యాయం చేయలేదు. 

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. అసంతృప్తితో కొందరు, టికెట్ దక్కలేదని మరికొందరు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో సీనియర్ ఆ దిశగా అడుగులువేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని ఆపార్టీ సీనియర్ నేత అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘‘దశాబ్ధకాలంగా పార్టీకి సేవ చేస్తున్నా.. ఎన్నో అవమానాలను భరించాను.. పిలిచి మాట్లాడే దిక్కే లేదు.. పాలిటిక్స్‌లో ఇన్ని ట్రిక్స్‌ ఉంటాయా.. అనిపించింది. నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్‌ఎస్‌ పార్టీకి విధివిధానాలు లేవు. ఉద్యమ సమయంలో రాత్రి, పగలు కష్టపడి కేసీఆర్‌తో కలిసి తెలంగాణ సాధించాం. అంత చేసినా నాకు పార్టీ న్యాయం చేయలేదు. కార్యకర్తల పరిస్థితి అదేవిధంగా ఉంది. పార్టీలో అన్యాయం, దోపిడీ జరుగుతోంది.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

తన మద్దతుదారులతో సంప్రదించి.. వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?