కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్నారు.. బీఆర్‌ఎస్, బీజేపీల‌పై రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్యలు

By Mahesh Rajamoni  |  First Published Nov 1, 2023, 5:09 AM IST

Congress leader Rahul Gandhi: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నాయ‌కుడు రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 'దొరల సర్కార్' స్థానంలో 'ప్రజల సర్కార్' వస్తుందని ఆయన తేల్చిచెప్పారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల పోరును దొర‌ల స‌ర్కారుకు, ప్ర‌జా సర్కారుకు మ‌ద్య జ‌రుగుతున్న‌ద‌ని పేర్కొన్నారు.
 


Hyderabad: తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్, బీజేపీలు రూ.లక్ష కోట్లు దోచుకున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు తూములు మునిగిపోయి కూలిపోతున్నాయన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడీగ‌డ్డ బ్యారేజీలో కొంత భాగం ఇటీవల మునిగిన ఘటనను ఆయన ప్రస్తావించారు. మూడు పార్టీలు కలిసి పని చేస్తున్నందున బీజేపీ, ఎంఐఎంలకు వేసిన ఓటు బీఆర్ఎస్ కు వేసినట్లేనని రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు చెప్పారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకున్న సొమ్మును కాంగ్రెస్ తిరిగి ప్రజలకు ఇస్తుందని హామీ ఇచ్చారు.

నాగార్జునసాగర్, జూరాల, శ్రీరాంసాగర్, సింగూరు వంటి అనేక ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్మించిందనీ, ఆ ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులతో పోల్చాలని కోరారు. అలాగే, బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించిన రాహుల్ గాంధీ, రాష్ట్ర అప్పులు తీర్చాలంటే 2040 వరకు తెలంగాణలోని ప్రతి కుటుంబం ఏటా రూ.31,500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కేటాయించిన బడుగు, బలహీన వర్గాలు, పేదల భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. కంప్యూటరీకరణ, ధరణి పోర్టల్ పేరుతో మీ ముఖ్యమంత్రి త‌మ భూములను లాక్కున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు అందడం లేదనీ, ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతున్నాయని, తెలంగాణ సంపద మొత్తం కేసీఆర్ కుటుంబం చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారు.

Latest Videos

undefined

అలాగే, అసెంబ్లీ ఎన్నికలు 'దొరల తెలంగాణ, ప్రజాల తెలంగాణ' (భూస్వాముల తెలంగాణ, ప్రజా తెలంగాణ) మధ్య పోరాటం అని పునరుద్ఘాటించిన రాహుల్ గాంధీ, ప్రజల తెలంగాణ కలను సాకారం చేయడానికి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. 'ప్రజా తెలంగాణ కలను మీరు చూశారు. దొరల తెలంగాణ కోసం మీరు పోరాడలేదని, త్యాగాలు చేశారని' చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. లోక్ సభలో బీజేపీకి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, ఇతర నేతలందరిపై సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు ఉన్నాయని, కానీ కేసీఆర్ పై కేసులు లేవ‌ని తెలిపారు. కాంగ్రెస్ ను నిలువరించేందుకు కలిసికట్టుగా పనిచేస్తున్నాయ‌ని బీఆర్ఎప్, బీజేపీ, ఎంఐఎం ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎంఐఎం కూడా బీజేపీకి అన్ని విధాలా సహకరిస్తోందని ఆరోపించారు. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో బీజేపీకి సహకరించేందుకు ఎంఐఎం అభ్యర్థులను బరిలోకి దింపిందన్నారు. 

తెలంగాణ ప్రజలు తన అమ్మమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి అండగా నిలిచారని గుర్తు చేశారు. 'ఈ రోజు మా అమ్మమ్మ వర్ధంతి. ఆమెకు అవసరమైనప్పుడు తెలంగాణ ప్రజలు మద్దతు తెలిపారు. దీన్ని ఎప్పటికీ మర్చిపోలేను' అని రాహుల్ గాంధీ అన్నారు. తన తల్లి సోనియాగాంధీ తెలంగాణ ప్రజలతో కలిసి తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్నారని చెప్పారు. పేదలు, ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, రైతులకు మేలు చేసే నవతెలంగాణ కోసం తామంతా కల పెట్టుకున్నామని చెప్పారు. తెలంగాణ కేవలం ఒక కుటుంబానికి మాత్రమే మేలు చేస్తుందనీ, పదేళ్లు ప్రజలు ఇబ్బందులు పడతారని తాము ఎప్పుడూ అనుకోలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను ఆయన వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్ణాటక, చత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందన్నారు. తన సోదరి ప్రియాంక గాంధీ బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉందని, అయితే జ్వరం కారణంగా రాలేకపోయారని రాహుల్ గాంధీ ప్రజలకు చెప్పారు.

click me!