
హైదరాబాద్: హైద్రాబాద్ Hayathnagar కు సమీపంలోని Laxma Reddy Palem వద్ద బుధవారం నాడు కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని Car ఢీకొట్టింది.ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మరణించాడు. వ్యక్తిని ఢీకొట్టిన కారు పక్కనే ఉన్న Bus Stop లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని Lorry Driver గా గుర్తించారు. మరో వైపు కారును నడిపిన Ajay ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అజయ్ మద్యం మత్తులో కారును నడిపినట్టుగా పోలీసులు గుర్తించారు.
నల్గొండ నుండి వస్తున్న కారు లక్ష్మారెడ్డి పాలెం వద్ద లారీ డ్రైవర్ ను ఢీకొట్టింది. లారీని రోడ్డు పక్కన నిలిపివేసి నడుచుకుంటూ వెళ్తున్న కిషన్ అనే వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కిషన్ అక్కడికక్కడే మరణించారు. కారులో ముగ్గురు వ్యక్తులున్నారు. కారులో అచ్చుతరెడ్డి, అజయ్ తో పాటు మరొకరు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. రాత్రి పూట వివాహ రెసెప్షన్ లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
హైద్రాబాద్ నగరంలో మద్యం మత్తులో ఇటీవల కాలంలో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమౌతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి. హోళీపండుగ రోజున అంతకు ముందు రోజున Hyderabad నగరంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు నగర వాసుల్ని భయబ్రాంతులకు గురి చేశాయి.
ఈ ఏడాది మార్చి 17వ తేదీన రాత్రిJubilee hillsవద్ద కారు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో రెండు మాసాల చిన్నారి మరణించింది. మరో ముగ్గురు గాయపడ్డారు. బోధన్ ఎమ్మెల్యే కజిన్ మీర్జాతో పాటు ఆయన కొడుకును ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకు రాహిల్ కూడా ఉన్నారని పోలీసులు గుర్తించారు.
మార్చి 18న గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి ప్రిసమ్ పబ్ నుండి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదానికి కారణామని తమ ప్రాథమిక విచారణలో తెలిసినట్లు పేర్కొన్నారు.
అతివేగంగా వచ్చిన వీరి కారు ఎల్లా హోటల్ ముందు ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టి గాల్లోకి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఆ దగ్గర్లోనే గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరిని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రోహిత్, జూనియర్ ఆర్టిస్ట్, యూట్యూబర్ గాయత్రిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
మార్చి 21న ట్యాంక్ బండ్ పై విధులు నిర్వహిస్తున్న ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్ ను కారు ఢీకొట్టింది. వాహనాలు తనిఖీ చేస్తున్న జహంగీర్ ను వెనుక నుండి వస్తున్న కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో జహంగీర్ తీవ్రంగా గా గాయపడ్డారు.
మార్చి 29న హైద్రాబాద్ జూబ్లీహిల్స్ వద్ద మద్యం మత్తులో ఓ యువకుడు ర్యాష్ గా కారు డ్రైవ్ చేశాడు. అతి వేగంగా కారు నడపడుతూ ఆటో, రెండు బైక్‌లను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. మద్యం మత్తులో నిందితుడు కారును ర్యాష్ గా డ్రైవ్ చేశారని పోలీసులు గుర్తించారు.
కారును నడిపిన వ్యక్తికి పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో 200 పాయింట్లు చూపింది. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.