Nalgonda : నల్గొండలో ఘోర ప్రమాదం... కాలిబూడిదైన ట్రావెల్స్ బస్సు, ఒకరు మృతి

Published : Dec 04, 2023, 07:44 AM ISTUpdated : Dec 04, 2023, 08:13 AM IST
Nalgonda : నల్గొండలో ఘోర ప్రమాదం... కాలిబూడిదైన ట్రావెల్స్ బస్సు, ఒకరు మృతి

సారాంశం

వేగంగా వెళుతున్న ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగి ప్రయాణికులు చిక్కుకున్న దుర్ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 

హైదరాబాద్ నుండి నెల్లూరుకు 38 మంది ప్రయాణికులతో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు గత రాత్రి బయలుదేరింది. అయితేే ప్రయాణికులంతా మంచి నిద్రలో వుండగా బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డుపక్కన నిలిపి ప్రయాణికులను హెచ్చరించాడు. అయితే అప్పటికే మంటలు చుట్టుముట్టడంతో కొందరు ప్రయాణికులు అందులో చిక్కుకున్నారు. వీరిలో ఒకరు మంటల్లో సజీవదహనం కాగా మిగతావారు తీవ్రంగా గాయపడ్డా ఎలాగోలా ప్రాణాలతో  బయటపడ్డారు.  

బస్సులో షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించడంతో పాటు గాయపడినవారిని హాస్పిటల్ కు తరలించారు. సమయానికి చికిత్స అందడంతో క్షతగాత్రులకు ప్రాణాపాయం తప్పింది.


 


 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!