నారాయణ కాలేజ్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం ఘటనలో ఒకరి మృతి

Siva Kodati |  
Published : Sep 04, 2022, 03:07 PM ISTUpdated : Sep 04, 2022, 03:11 PM IST
నారాయణ కాలేజ్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం ఘటనలో ఒకరి మృతి

సారాంశం

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నారాయణ కాలేజీలో ప్రిన్సిపాల్ గదిలో విద్యార్ధి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నారాయణ కాలేజీలో ప్రిన్సిపాల్ గదిలో విద్యార్ధి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 15 రోజుల క్రితం అంబర్‌పేట్ నారాయణ కాలేజీలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడో విద్యార్ధి. ఈ క్రమంలో విద్యార్ధిని రక్షించే ప్రయత్నం చేశారు ప్రిన్సిపల్, ఏవో అశోక్ రెడ్డి .. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో మరణించారు అశోక్ రెడ్డి. విద్యార్ధి సందీప్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

కాగా.. రామంతాపూర్‌లోని నారాయణ కాలేజీలో ఓ విద్యార్ధి ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి ఆయనను టీసీ ఇవ్వమని కోరాడు. అయితే గతకొద్దిరోజులుగా బాధిత విద్యార్ధి టీసీ కోసం కాలేజీకి వెళ్తుంటే తిప్పుతున్నారు. దీంతో విసిగిపోయిన ఆ విద్యార్ధి ప్రిన్సిపాల్ గదిలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.  అంతేకాదు.. శరీరం మంటల్లో కాలిపోతుండగానే ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డిని పట్టుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అరుపులు , కేకలు వినిపించడంతో ఏవో అశోక్ రెడ్డి ప్రిన్సిపాల్‌ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ముగ్గురి మంటలను అదుపు చేసి ఆసుపత్రికి తరలించారు. తొలుత గాంధీ ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం యశోదా ఆసుపత్రికి తరలించారు. 

ALso REad:విద్యార్ధి ఆత్మహత్యాయత్నం వ్యవహారం.. తెలంగాణ సర్కార్ సీరియస్, నారాయణ కాలేజీకి నోటీసులు

దీనిపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ స్పందించారు. కాలేజీ యాజమాన్యాన్ని నివేదిక కోరామని.. దీని ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విద్యార్ధులకు సర్టిఫికెట్స్ ఆపినా, ఫీజుల కోసం వేధించినా కఠిన చర్యలు తీసుకుంటామని జలీల్ హెచ్చరించారు. విద్యార్ధులకు అండగా వుంటామని.. ఎలాంటి సమస్యలున్నా నేరుగా బోర్డును సంప్రదించాలని ఆయన సూచించారు

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు