హైదరాబాదులో కారు బీభత్సం: యువకుడు మృతి, మరో యువకుడు పరార్

Published : Feb 27, 2021, 08:56 AM ISTUpdated : Feb 27, 2021, 08:57 AM IST
హైదరాబాదులో కారు బీభత్సం: యువకుడు మృతి, మరో యువకుడు పరార్

సారాంశం

శనివారం తెల్లవారుజామున హైదారబాదులోని వనస్థలిపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది, కారు ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఢికొట్టి, డివైడర్ పైనుంచి దూసుకెళ్లి రోడ్డుకు మరో వైపు పడింది.

హైదరాబాదు: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కారు బీభత్సం సృష్టించింది. వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో శనివారం తెల్లవారు జామును ఈ ప్రమాదం జరిగింది. కారు ట్రాఫిక్ సిగ్నల్ ను ఢీకొట్టింది.

ట్రాఫిక్ సిగ్నల్ ను ఢీకొట్టిన తర్వాత కారు డివైడర్ పై నుంచి మరో వైపు దూసుకెళ్లింది. మద్యం మత్తులో యువకుుడ గౌతమ్ అనే యువకుడు కారు నడిపినట్లు తేలింది. ఈ ప్రమాదంలో సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. 

మరో యువకుడు పరారయ్యాడు. కారు నడిపిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు సాగర్ రోడ్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Holiday : ఈసారి లాంగ్ వీకెండ్.. వరుసగా మూడ్రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?