మహిళ నోట్లో గుడ్డలు కుక్కి.. దారుణ హత్య

Published : Feb 27, 2021, 08:10 AM ISTUpdated : Feb 27, 2021, 08:14 AM IST
మహిళ నోట్లో గుడ్డలు కుక్కి.. దారుణ హత్య

సారాంశం

ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట అదృశ్యం కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

గుర్తు తెలియని వ్యక్తులు మహిళ నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన వికారాబాద్ సమీపంలోని ఆలంపల్లి-గెరిగేట్ పల్లి రైల్వే వంతెన సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వికారాబాద్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...  ధరూర్ మండలం హౌసుపల్లికి చెందిన అమృతమ్మ(38) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

గురువారం వికారాబాద్ కు పనికోసం వచ్చిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆమె రాక కోసం ఎదురుచూసిన కుటుంబసభ్యులు ఎంతకీ రాకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట అదృశ్యం కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

శుక్రవారం సాయంత్రం రైల్వే వంతెన వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అమృతమ్మదిగా గుర్తించారు. నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే