Omicron : తెలంగాణ ఒమిక్రాన్ వేరియంట్ బులెటిన్ ఇదే.. ఎంతమంది విదేశీయులు వచ్చారంటే..?

Siva Kodati |  
Published : Dec 03, 2021, 08:52 PM ISTUpdated : Dec 03, 2021, 08:56 PM IST
Omicron : తెలంగాణ ఒమిక్రాన్ వేరియంట్ బులెటిన్ ఇదే.. ఎంతమంది విదేశీయులు వచ్చారంటే..?

సారాంశం

తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్‌కు (omicron) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. తెలంగాణకు ఇప్పటి వరకు విదేశాల నుంచి 909 మంది రాగా.. ఇవాళ 219 మంది వచ్చినట్లు వెల్లడించింది. శుక్రవారం మొత్తం 9 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. జీనోమ్ శాంపిల్స్ కోసం 13 కేసులను ల్యాబ్‌కు పంపినట్లు బులెటిన్‌లో వెల్లడించింది.   

తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్‌కు (omicron) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. తెలంగాణకు ఇప్పటి వరకు విదేశాల నుంచి 909 మంది రాగా.. ఇవాళ 219 మంది వచ్చినట్లు వెల్లడించింది. శుక్రవారం మొత్తం 9 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. జీనోమ్ శాంపిల్స్ కోసం 13 కేసులను ల్యాబ్‌కు పంపినట్లు బులెటిన్‌లో వెల్లడించింది. 

మరోవైపు సౌతాఫ్రికాలో (south africa) వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. తాజాగా భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించినట్లు కేంద్రం శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ ఒమిక్రాన్ కలకలం రేగింది. విదేశాల నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించి క్వారంటైన్‌లో ఉంచారు. ఆమె నుంచి శాంపిల్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఆమెకు సోకింది ఏ వేరియంట్ అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

Also Read:క్యాంపులో ఉన్న ఆ టీఆర్ఎస్ లీడ‌ర్ల‌కు ఓమ్రికాన్ భ‌యం..

ఈ సంగతి పక్కనబెడితే.. విదేశాల నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి (shamshabad airport) వచ్చిన వారిలో 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి (tims hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. యూకే నుంచి 9 మంది, సింగపూర్, కెనడా, అమెరికాల నుంచి ఒక్కొక్కరు మొత్తం 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

కాగా.. కోవిషీల్డ్ (covishield vaccine) రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించాలంటూ తెలంగాణ  మంత్రి హరీశ్ రావు (harish rao) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండో డోసుకు 12 వారాల వ్యవధి వుండటంతో సమస్యలు ఎదురవుతున్నాయంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు (mansukh mandaviya) లేఖ రాశారు. వ్యవధి ఎక్కువ వుండటంతో రెండో డోసు వేయడం కష్టంగా మారిందన్నారు. వలస కూలీలు మొదటి డోసు వేసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. వారిని గుర్తించి సెకండ్ డోస్ వేయడం చాలా కష్టంగా మారిందన్నారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర కూలీల విషయంలో ఇబ్బంది ఎక్కువగా వుందన్నారు. అందువల్ల గతంలో మాదిరిగా రెండో డోసు వ్యవధిని 4 - 6 వారాలకు తగ్గించాలని హరీశ్ రావు కోరారు. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్లు, హైరిస్క్ వారికి బూస్టర్ డోస్‌కు (booster dose) అనుమతి ఇవ్వాలని మంత్రి కేంద్రాన్ని విజ్ఞప్తికి చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్