
కామారెడ్డి : ఆత్మహత్య చేసుకుంటానంటూ రైలుకు అడ్డంగా వెళుతూ ఓ వృద్దుడు కామారెడ్డిలో హల్ చల్ చేసాడు. పట్టాలపై వృద్దున్ని గుర్తించిన లోకో పైలట్ స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. వృద్దుడిని పట్టాలపైనుండి పక్కకు తరలించాకే రైలు ముందుకు వెళ్లింది.
వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లలా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన పాపన్నగారి రఘుపతి అనే వృద్దుడు ఇళ్ళు కట్టుకుంటున్నాడు. అయితే ఈ ఇంటి విషయంలో సమీప బంధువులు, కుటుంబసభ్యులతో గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన రఘుపతి ఆత్మహత్యాయత్నానికి సిద్దమయ్యాడు.
Read More హైదరాబాద్ : సుతిమెత్తగా మసాజ్ చేస్తూనే ఒంటిపై బంగారం దోచేసారట..!
గ్రామంనుండి నేరుగా కామారెడ్డి రైల్వేస్టేషన్ కు చేరుకున్న రఘుపతి నిలిపివున్న రైలుముందు పట్టాలపైకి వెళ్లాడు. ఇది గమనించిన లోకో పైలట్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వెంటనే రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు.