భారీ వర్షాలతో తడిసి ముద్ధవుతున్న హైదరాబాద్.. కుప్పకూలుతున్న పాత భవనాలు

By Siva KodatiFirst Published Jul 14, 2021, 6:16 PM IST
Highlights

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది. వానల కారణంగా పురాతన, శిథిలావస్థలో వున్న భవనాలు కుప్పకూలుతున్నాయి. బుధవారం ఓల్డ్ మలక్ పేట్‌లోని ఓ పాత భవనం చూస్తుండగానే కుప్పకూలింది. 
 

చూస్తుండగానే కుప్పకూలిందో భవనం.. ఎక్కడో కాదు హైదరాబాద్‌లో. నగరంలోని ఓల్డ్ మలక్ పేట్‌లోని ఓ బస్తీలో వానకు తడిసి కూలిపోయింది. గత నాలుగు రోజులుగా నగరంలో కురుస్తున్న వానలకు ఈ భవనం బాగా నానింది. చాలా కాలం నుంచి ఈ భవనం పటిష్టతపై అనుమానాలు వస్తూనే వున్నాయి. వర్షాలకు బాగా నానిన భవనం ఒక్కసారిగా కూలిపోయింది. 

కాగా, తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం కూడా భారీ నుండి అతి భారీ వర్షములతో పాటు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో గాలులు వీస్తాయని, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వెల్లడించింది. 

click me!