మహబూబాబాద్ రైల్వేస్టేషన్ లో నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది.
మహబూబాబాద్: నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో ఆదివారం నాడు పొగలు వచ్చాయి. దీంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేశారు. సాంకేతిక కారణాలతోనే నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. రైలు బ్రేక్ లైనర్స్ పట్టేయడంతో పొగలు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేశారు. అహ్మదాబాద్ నుండి చెన్నైకి నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు వెళ్తున్న సమయంలో మహబూబాబాద్ రైల్వేస్టేషన్ కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
2022 నవంబర్ 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గూడూరులో నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు వ్యాపించాయి. ఈ మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.
చెన్నై సెంట్రల్ నుండి అహ్మదాబాద్ వైపు నవజీవన్ ఎక్స్ ప్రెస్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైలులోని ప్యాంట్రీ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో రైలులోని ప్రయాణీకులు ఆందోళన చెందారు. వెంటనే రైల్వే అధికారులు రైలును గూడూరు రైల్వేస్టేషన్ లో నిలిపివేసి మంటలను ఆర్పివేశారు.