వాష్‌రూమ్‌లో కెమెరా.. ఫోటోలు, వీడియోలతో మహిళా ఉద్యోగులకు వేధింపులు, నిందితుడు ఆఫీస్ బాయ్

Siva Kodati |  
Published : May 26, 2022, 05:46 PM ISTUpdated : May 26, 2022, 05:49 PM IST
వాష్‌రూమ్‌లో కెమెరా.. ఫోటోలు, వీడియోలతో మహిళా ఉద్యోగులకు వేధింపులు, నిందితుడు ఆఫీస్ బాయ్

సారాంశం

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ బట్టల దుకాణంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న వ్యక్తి మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నాడు. వాష్ రూమ్‌లో కెమెరా పెట్టి ఫోటోలు, వీడియోలు సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. 

హైదరాబాద్ (hyderabad) బంజారాహిల్స్‌లోని  (banjara hills) ఓ బట్టల దుకాణంలో దారుణం జరిగింది. మహిళా ఉద్యోగుల పట్ల ఓ ఆఫీస్ బాయ్ దారుణానికి తెగబడ్డాడు. మహిళా ఉద్యోగులు వాడే వాష్‌రూమ్‌లో కెమెరా పెట్టిన ఆఫీస్ బాయ్ .. ఫోటోలు అడ్డుపెట్టుకుని వారిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న యువతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమెకే పంపి వేధింపులకు గురిచేశాడు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిందితుడు మిథున్ కొన్నాళ్లుగా బట్టల దుకాణంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే