అచ్చు దృశ్యం సినిమానే: డాక్టర్ వైశాలి కిడ్నాప్‌నకు నవీన్ రెడ్డి పక్కా ప్లాన్

By narsimha lode  |  First Published Dec 13, 2022, 1:52 PM IST

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో డాక్టర్ వైశాలి కిడ్నాప్  సమయంలో  నవీన్ రెడ్డి పకడ్బందీ ప్లాన్ తో వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. దృశ్యం సినిమా తరహలోనే నిందితుడు  పోలీసులను పక్కదోవపట్టించేలా ప్లాన్ చేశారు.


హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మన్నెగూడలో  డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి  ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.  అయితే  నవీన్ రెడ్డి  పక్కా పథకం ప్రకారంగానే  డాక్టర్ వైశాలిని కిడ్నాప్  చేసేందుకు ప్లాన్  చేసినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు.  డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసిన  సమయంలో  తన ఫోన్ ను  విజయవాడ వైపునకు కారులో  పంపాడు.

డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసేందుకు  వచ్చిన యువకుల ఫోన్లను ముందుగానే  స్విచ్ఛాఫ్  చేయించారు. వైశాలిని తీసుకొని నవీన్ రెడ్డి  నాగార్జునసాగర్ వైపునకు కారులో వెళ్లాడు. తన వోల్వో కారును శంషాబాద్  పరిసర ప్రాంతంలో తిప్పాడు. పోలీసుల నిఘా ఎక్కువైందని గుర్తించిన నవీన్ రెడ్డి  నాగార్జున సాగర్ కు సమీపంలో డాక్టర్ వైశాలిని వదిలి వెళ్లిపోయాడు. నవీన్ రెడ్డి  ఉపయోగించిన కారును శంషాబాద్  ఎయిర్ పోర్టుకు సమీపంలో  పోలీసులు సోమవారంనాడు గుర్తించారు.  ఈ కారును  పోలీసులు క్రేన్ సహయంతో పోలీస్ స్టేషన్ కు  తరలించారు. ఈ కారు డోర్లు ఓపెన్ చేసేందుకు  పోలీసుుల ప్రయత్నిస్తున్నారు. ఈ వోల్వో కారు నవీన్ రెడ్డి  పేరుతో  రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్టుగా  పోలీసులు గుర్తించారు. నవీన్ రెడ్డి బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారని  పోలీసులు అనుమానిస్తున్నారు.  నవీన్ రెడ్డితో పాటు  మరో ముగ్గురు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.

Latest Videos

undefined

also read:డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు: శంషాబాద్ సమీపంలో నవీన్ రెడ్డి కారు గుర్తింపు

డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసిన తర్వాత  బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ  సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  సినిమా తరహాలో  డాక్టర్ వైశాలిని నిందితుడు కిడ్నాప్ చేశారు.  నవీన్ రెడ్డిని అరెస్ట్  చేసి వైశాలిని కాపాడాలని సాగర్ హైవేపై  బాధిత కుటుంబ సభ్యులు ఈ నెల 9వ తేదీన ఆందోళన నిర్వహించారు. నిందితుడిని పట్టుకొంటామని  బాధిత కుటుంబానికి  పోలీసులు హామీ ఇచ్చారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడే నిఘాను ఏర్పాటు చేశారని  అనుమానించిన  నవీన్ రెడ్డి నాగార్జునసాగర్ కు సమీపంలో వైశాలిని వదిలేసి వెళ్లిపోయాడు.  డాక్టర్ వైశాలిని  కిడ్నాప్ చేసిన  సమయంలో తన ఆచూకీని గుర్తించకుండా  ఉండేందుకు  గాను నవీన్ రెడ్డి  తన ఫోన్ ను ఒకవైపునకు పంపి, తాను  మరో వైపునకు వెళ్లినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు.
 

click me!