వరంగల్ లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. ఉద్రిక్తత..

By SumaBala Bukka  |  First Published Jan 8, 2022, 1:21 PM IST

వరంగల్ లో ఆత్మహత్యాయత్నంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హాస్టల్ లో ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిణి ఆస్పత్రి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. 


హన్మకొండ : Warangal నగరంలోని Rohini Hospital హాస్టళ్లో నర్సింగ్ విద్యార్థిని suicide attempt చేసింది. హాస్టళ్లోనే విద్యార్థిని ఉరి వేసుకున్నట్లు సమాచారం. గమనించిన యాజమాన్యం విద్యార్థినిని రోహిణి ఆస్పత్రికి తరలించింది. సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. 

Nursing student  ఆత్మహత్యాయత్నంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హాస్టల్ లో ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిణి ఆస్పత్రి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. 

Latest Videos

కాగా, తెలంగాణలోని Karimnagar జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మానకొండూరు మండలం చెంజర్ల గ్రామ శివారులో గల గుట్టలో Young woman brutally murderకు గురైంది. యువతి dead bodyని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

కాగా యువతి హత్యకు love affair కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన విధానం, అనుమానితులను బట్టి... కాగా ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాల మీద పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు ప్రేమ వ్యవహారమా? మరేదైనా కారణం ఉందా? అనే యాంగిల్ లో విచారణ కొనసాగుతోంది.

మానకొండూరు మండలం చెంజర్ల గ్రామ శివారులో గల గుట్టల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతికి.. పక్క గ్రామమైన పోరండ్ల గ్రామానికి చెందిన ఆశోద అకిల్ అనే యువకుడితో గత ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కాగా వీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే వీరి పెళ్లికి మైనర్ అనేది అడ్డు వచ్చింది. 

దీంతో రెండు సంవత్సరాలుగా ఇద్దరు దూరంగా ఉంటున్నారు. కాగా, ఇటీవల ప్రేమికుడు మళ్లీ అమ్మాయికి దగ్గరయ్యాడు. మాటలు కలుపుతూ మెల్లిగా అమ్మాయిని లొంగదీసుకున్నాడు. ఆ తరువాత ఆమెను పథకం ప్రకారం హత్య చేశాడు. అయితే, వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిన అమ్మాయి దొరకకపోవడంతో.. తల్లిదండ్రులు అంతా వెతికి తప్పిపోయిందంటూ ఎల్ఎండి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

మానకొండూరు మండలం పొరండ్ల గుట్టల్లో శవం లభ్యం కావడంతో.. దాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని.. తమ దగ్గర నమోదైన మిస్సింగ్ కేసుగా అనుమానించి.. ఆ దిశగా దర్యాప్తు చేశారు. చివరికి మన్నె పల్లీ గ్రామానికి చెందిన యువతి మృతదేహంగా గుర్తించారు. 

దాదాపు వారం రోజుల్లో కిందే ప్రియుడు.. యువతిని పోరండ్ల గుట్టల్లోకి లాక్కెళ్లి.. అత్యాచారం చేసి.. హత్య చేశాడని తేలింది. హత్య జరిగి వారం రోజులు కావడంతో శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోరండ్ల గ్రామానికి చెందిన నిందితుడు ఆశోద అకిల్ అదుపులోకి తీసుకుని ఎల్ఎండి పోలీసులు విచారణ చేపట్టారు.  ఈ హత్య కేస లో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

click me!