కంఠమనేని ఉమామహేశ్వరి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. ఎల్లుండి అంత్యక్రియలు

Siva Kodati |  
Published : Aug 01, 2022, 06:09 PM IST
కంఠమనేని ఉమామహేశ్వరి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. ఎల్లుండి అంత్యక్రియలు

సారాంశం

ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య వ్యవహారం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె అంత్యక్రియలను ఎల్లుండి నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 

ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య వ్యవహారం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె అంత్యక్రియలను ఎల్లుండి నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. మరోవైపు ఉమామహేశ్వరి మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. 

ALso REad:లోపలికి వెళ్లి ఎంతకూ బయటకు రాలేదు, తలుపులు బద్దలుకొట్టి చూస్తే.. : కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తె

ఇకపోతే.. తొలుత అనారోగ్య కారణాలతో ఉమామహేశ్వరి మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు ఆత్మహత్యగా తేల్చడంతో ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగానే ఉమామహేశ్వరి బలవన్మరణానికి పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 2.30కి ఉమామహేశ్వరి కూతురు దీక్షిత కాల్ చేసిందన్నారు. తన తల్లి ఆత్మహత్య చేసుకుందని దీక్షిత సమాచారం ఇచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో మధ్యాహ్నం 2.45కి ఉమామహేశ్వరి నివాసానికి వెళ్లామని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉమామహేశ్వరి గదిలోకి వెళ్లామని... దీక్షిత ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. 

Also REad:ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరిది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

అంతకుముందు ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతోనే తన తల్లి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురమే వున్నామని.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమ్మ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుందన్నారు. భోజనం సమయం వరకు బయటకు రాకపోవడంతో .. తలుపులు తెరిచే ప్రయత్నం చేశామని దీక్షిత చెప్పారు. లోపలి నుంచి గడియ పెట్టుకుని ఉందని.. ఆత్మహత్య సమయంలో తన భర్తతో పాటు నాన్న కూడా ఇంట్లోనే వున్నారని దీక్షిత తెలిపారు. ఇకపోతే.. ఉమామహేశ్వరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరిలో ఇటీవలే చిన్న కుమార్తెకు వివాహం జరిగింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?
Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!