యాంటీ డిప్రెషన్‌, మెడికేషన్‌తో సతమతం.. గతంలోనూ గంటల తరబడి గదిలోనే: ఉమామహేశ్వరి కేసులో వెలుగులోకి వాస్తవాలు

Siva Kodati |  
Published : Aug 01, 2022, 07:41 PM IST
యాంటీ డిప్రెషన్‌, మెడికేషన్‌తో సతమతం.. గతంలోనూ గంటల తరబడి గదిలోనే: ఉమామహేశ్వరి కేసులో వెలుగులోకి వాస్తవాలు

సారాంశం

ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య కేసులో అనేక వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. యాంటీ డిప్రెషన్‌ పాటు మెడికేషన్‌‌లో వున్నారు ఉమామహేశ్వరి. కుమార్తె దీక్షిత ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు .   

ఎన్టీఆర్ (ntr) కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (kantamaneni uma maheswari) ఆత్మహత్య వ్యవహారం నందమూరి కుటుంబంలో (nandamuri family) తీవ్ర విషాదం నింపింది. ఈ క్రమంలో పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతకాలంగా యాంటీ డిప్రెషన్‌ పాటు మెడికేషన్‌‌లో వున్నారు ఉమామహేశ్వరి. తీవ్రమైన మానసిక ఒత్తిడి, అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నిన్న రాత్రే ఉమామహేశ్వరి ఇంటికి వచ్చారు అల్లుడు, కూతురు. అయితే గత మూడు రోజులుగా ఉమామహేశ్వరి భర్త ఇంట్లో లేరు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి వచ్చారు భర్త . 

Also Read:ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య... పోలీసుల వెర్షన్ ఇదే

ఆత్మహత్య సమయంలో ఇంట్లో అల్లుడు, కూతురు, భర్త సోదరి, వంట మనిషి, పనిమనుషులు వున్నారు. అమెరికాలో పెద్ద కుమార్తె విశాల, హైదరాబాద్ బాచుపల్లిలో చిన్న కుమార్తె దీక్షిత నివసిస్తున్నారు. సోమవారం ఉదయం పది గంటల సమయంలో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు ఉమామహేశ్వరి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పనిమనిషి తలుపు తట్టింది. అయితే స్పందన లేకపోవడంతో మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో మరోసారి ఉమామహేశ్వరిని పనిమనిషి లేపే ప్రయత్నం చేసింది. గతంలో చాలాసార్లు తలుపులు వేసుకుని గంటల తరబడి గదిలోనే వుండిపోయేవారు ఉమామహేశ్వరి. గాఢ నిద్రలో వున్నారని ఎవరూ కూడా బలవంతంగా లేపే ప్రయత్నం చేసేవారు కాదట. 

అయితే ఎంతకీ తలుపు గడియ తీయకపోవడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బలంగా తలుపులు నెట్టి లోపలికి వెళ్లారు అల్లుడు, కూతురు. ఈ క్రమంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు ఉమామహేశ్వరి. దీంతో చున్నీతో కట్ చేసి మృతదేహాన్ని కిందకు దించారు అల్లుడు, కూతురు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మావయ్య నందమూరి బాలకృష్ణకు (nandamuri balakrishna) సమాచారమిచ్చారు చిన్న కుమార్తె దీక్షిత. తర్వాత చంద్రబాబు (chandrababu naidu) , లోకేష్ (nara lokesh), దగ్గుబాటి వెంకటేశ్వరరావు (daggubati venkateswara rao) సమాచారమిచ్చారు దీక్షిత. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో  పొలీసులకు సమాచారమిచ్చారు పోలీసులు. మధ్యాహ్నం 3 గంటలకు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు పోలీసులు. 

Also Read:ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరిది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

ఇకపోతే... కంఠమనేని ఉమామహేశ్వరి కళ్లను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఉమామహేశ్వరి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. దీక్షిత ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు . 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్