ఉపాధి కూలి రూ.300 కు పెంచాలి : నూనె వెంకటస్వామి

First Published May 29, 2018, 5:15 PM IST
Highlights

అత్త సొమ్ము అల్లుడి దానం చెల్లదు

ఉపాధి హామీ కింద కూలీలకు రోజువారి ఇచ్చే వేతనాన్ని 300లకు పెంచాలని ప్రజా పోరాట సమితి అధ్యక్షులు నూనె వెంకటస్వామి డిమాండ్ చేశారు. కూలీలకు మూడు నెలలుగా చేసిన పనికి సంబంధించిన 1800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా తాత్సారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీల నోటికాడి ముద్దను కొల్లగొట్టి, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఇతర పథకాలకు కేటాయించారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. వెంటనే కూలీల బకాయిల డబ్బులు చెల్లించకుంటే రాష్ట్ర ప్రభుత్వం కార్యకలాపాలను అడ్డుకోవాల్సింది వస్తుందని నూనె హెచ్చరించారు.

మంగళవారం చిట్యాల్లో పీఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు ఎంపిడిఒ కార్యాలయాన్ని ముట్టడిలో పాల్గొన్న ఆయన ప్రత్యేకంగా  పాల్గొని మాట్లాడారు. రోజు కూలీని 300 రూపాయలకు, గడ్డపార పదునుకు 20 రూపాయలకు మంచినీటికి 10 రూపాయలకు మేట్లకు ప్రతి కూలీకి 5 రూపాయల వరకు పెంచి చెల్లించే వరకు, మరియు కొలతలను తొలగించి, రోజు కూలి ఇచ్చే వరకు ఉపాధి కూలీల పోరాటం కొనసాగుతుందని" ఆయన అన్నారు.

మండలం నుండి వందలాదిగా తరలి వచ్చి కూలీలు పెద్ద ఎత్తున నినాదాలను ఇచ్చారు. సంతకాలతో కూడిన మెమోరాండాన్ని ఎంపీడీవో, ఏపీవోలకు సమర్పించారు. ఈ మట్టడిలో ఉపాధి కులీ సంఘం (టి.వి.కె.ఎస్.) జిల్లా అధ్యక్షులు నీలకంఠం నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు రుద్రవరం నర్సింహ, జిల్లా నాయకులు నాగిల్ల ,యాదయ్య, యన్నమల్ల పృథ్వి రాజ్ తో పాటు మండల నాయకులు బుర్రి శేఖర్రెడ్డి, కోనేటి క్రిష్ణయ్య, పెరిక సరిత, మెట్టు సంతోష, సునీత, సుగుణమ్మ, నర్సిరెడ్డి, ఎల్లెందుల పద్మ, మేడి లింగయ్య, లలితా, పద్మ, మొదలగు వారు పాల్గొన్నారు.

click me!