రాజకీయనాయకుల్లా మాట్లాడటం చేతకాదు.. సుహాసిని

By ramya neerukondaFirst Published Dec 1, 2018, 9:44 AM IST
Highlights

నందమూరి సుహాసిని... తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగానే సమాధానం ఇచ్చారు. మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసినికి కూకట్ పల్లి టికెట్ కేటాయించారు. 

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని... తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగానే సమాధానం ఇచ్చారు. మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసినికి కూకట్ పల్లి టికెట్ కేటాయించారు. అయితే.. అప్పటి వరకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న సుహాసిని.. అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. 

అయితే.. ఆమె మీడియా ముందు సరిగా మాట్లాడలేకపోతోందని.. తెలుగు రాదేమో అంటూ.. సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. కాగా.. తనపై వస్తున్న విమర్శలకు ఆమె తాజాగా ఘాటుగానే సమాధానం ఇచ్చారు.

‘‘నేను తెలుగులో స్పష్టంగా మాట్లాడగలను. కాకపోతే.. రాజకీయ నేతల్లాగా మాట్లాడలేను. మీడియా కాన్ఫరెన్స్ లలో, పబ్లిక్ మీటింగ్ లలో ఇంగ్లీష్ పదాలు వాడకూడదని నాకు చెప్పారు. అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. మా ఇంట్లో కూడా తెలుగే మాట్లాడతాను’’ అని చెప్పారు. 

ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలు తీరుస్తూ.. కార్యకర్తలకు అండగా ఉండాలని తన మామయ్య చంద్రబాబు నాయుడు తనకు చెప్పినట్లు ఆమె వివరించారు. ఈ ఎన్నికల ప్రచారంలో తాను ప్రజలకు పెద్ద పెద్ద హామీలు ఏమీ ఇవ్వడం లేదని.. గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె తెలిపారు. 

‘‘ట్రాఫిక్‌ సమస్య, విద్య, వైద్యం, ఆర్యోగ రంగాలపై ప్రధానంగా దృష్టి పెడతాను. అభివృద్ధి పనుల్లో నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. రాజ్యాంగం, చట్టాలపై అవగాహన ఉన్నందున ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగిస్తాను. నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాను. రోడ్లు, డ్రైనేజీ, మ్యాన్‌హోల్స్‌ సమస్యలు దారుణంగా ఉన్నాయి. ప్రచారంలో భాగంగా ప్రజలను కలుస్తున్నప్పుడు కాలనీల్లోని సమస్యలను నోట్‌ చేసుకుంటున్నాం. చెరువుల పరిరక్షణ చేపడతాం. ప్రభుత్వ భూములను ప్రజావసరాలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. అక్రమాలకు తావులేకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తాను. పాలనలో ప్రజలను భాగస్వాములను చేసి సమస్యలను సాఽధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాను. ప్రజల సహకారంతో పారిశుధ్య సమస్యకు చెక్‌ పెడతాం.’’ అని ఆమె వివరించారు.

మరిన్ని వార్తలు చదవండి

సుహాసినికి ప్రచారం: మరో ఐదు రోజులు హైదరాబాదులో చంద్రబాబు

సుహాసినికి మద్దతుగా..ప్రచారం చేసిన కళ్యాణ్ రామ్ భార్య

నందమూరి సుహాసినికి షాక్...ప్రచారానికి రానన్న భువనేశ్వరి

సుహాసిని కోసం ఎన్నికల ప్రచారానికి ఏపీ మంత్రి సునీత

నందమూరి సుహాసిని తలుపుతట్టిన అదృష్టం...ఎలా అంటే

 

click me!