వారి ఆదేశాల మేరకే... బిజెపి చీఫ్ బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసులు: సిపి సత్యనారాయణ (Video)

By Arun Kumar PFirst Published Jan 3, 2022, 12:43 PM IST
Highlights

తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ను ఆదివారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసారు.  

కరీంనగర్: నిరుద్యోగ జాగరణ దీక్షను అడ్డుకుని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ని అరెస్ట్ (bandi sanjay arrest) చేసిన పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు (non bailable cases on bandi sanjay) నమోదుచేసారు. నిబంధనలు ఉల్లంఘించిన బండి సంజయ్ తో పాటు 16 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు కరీంనగర్ కమీషనర్ సత్యనారాయణ (cp satyanarayana) తెలిపారు. మొత్తంగా 70 మంది బీజేపీ నాయకులు (bjp leaders), కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సిపి వెల్లడించారు. 

బిజెపి నాయకులపై డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ (DMA Act) కింద కేసులు నమోదు చేసామని సిపి తెలిపారు. 332, 333, 149, 147  సెక్షన్ల తో పాటు 188 DM 51b జీవో నంబర్ 1 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు కేసులు నమోదు చేసినట్లు సిపి తెలిపారు. 

Video

తాము హెచ్చరిస్తున్నా వినకుండా బిజెపి నాయకులు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని అన్నారు. సోషల్ డిస్టెన్స్ (social distance) పాటించకపోగా పోలీసులపైనే దాడి చేశారని తెలిపారు. బిజెపి నాయకులు, కార్యకర్తల దాడిలో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయని సిపి సత్యనారాయణ తెలిపారు. 

read more  Bandi Sanjayపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు.. కరీంనగర్‌లో టెన్షన్

కోవిడ్ థర్డ్ వేవ్ (corona third wave) విజృంభిస్తున్న నేపథ్యంలోనే నిబంధనలను పాటించకపోవడం వల్లే ఎంపీ సంజయ్ ని అరెస్టు చేశామని సిపి స్పష్టం చేసారు. ఇవాళ ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకే ఈ అరెస్టు జరిగిందని సిపి పేర్కొన్నారు.

నిరుద్యోగ జాగరణ పేరిట చేపట్టిన దీక్షకు బండి సంజయ్ ఎలాంటి అనుమతి తీసుకోలేదని సిపి తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో కేంద్రతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు Goms నంబర్ 1 ఇచ్చాయని..  దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని...  ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయన్నారు సిపి. 

''కోవిడ్ వ్యాప్తి సమయంలో బండి సంజయ్ దీక్షకు దిగడంతో నోటీసు ఇచ్చాము. అయినా వందలాది మంది గుమిగూడారు. మాస్క్ లు పెట్టుకోకుండా, సోషల్ డిస్టెన్స్ లేకుండా కోవిడ్ నిబంధనలు పాటించలేదు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో dma యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నాం. ఇప్పటివరకు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసాం'' అని సిపి వెల్లడించారు.

read more  Bandi Sanjay దీక్ష భ‌గ్నం.. గ్యాస్ క‌ట్ట‌ర్ తో గేట్‌ను కట్ చేసిన పోలీసులు

''పోలీసుల మీద దాడి కేసులో 16 మంది మీద కేసు నమోదు చేసాం. ఇప్పటివరకూ ఐదుగురు అరెస్ట్ చేసాం. అందులోనే ఎంపీ సంజయ్ కూడా ఉన్నారు. మొత్తం రెండు కేసులు నమోదయ్యాయి. వైద్య పరీక్షల అనంతరం బండి సంజయ్ ను కోర్టులో హాజరు పరుస్తాం'' అని సిపి సత్యనారాయణ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు (GO 317) నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay).. కరీంనగర్‌లోని (Karimnagar) తన ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు ఆదివారం రాత్రి భగ్నం చేశారు.  ఆయనను ప్రస్తుతం కరీంనగర్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌(పీటీసీ) లో వుంచారు.  
 


 

click me!