వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం.. భార్యపై పెట్రోల్ పోసి..

Published : Apr 15, 2020, 09:52 AM IST
వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం.. భార్యపై పెట్రోల్ పోసి..

సారాంశం

దీంతో ఆమె ఈ నెల 10న గ్రామంలోని పుట్టింటికి చేరుకుంది. సోమవారం రాత్రి సాబేర్‌మియా తన కుమారుడు రహ్మతుల్లా, అన్న షాబుద్దీన్‌, అతని కుమారులు షేక్‌ ఉబేదుల్లా, షేక్‌ కలీముల్లాతో కలిసి షాహిన్‌బేగం వద్దకు వచ్చి దాడి చేశాడు.

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ సంఘటన వికారాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..వికారాబాద్‌ జిల్లా ధారూరు మండల పరిధిలోని తరిగోపుల గ్రామానికి చెందిన షాహిన్ బేగం(37) కి కొన్ని సంవత్సరాల క్రితం షేక్‌ సాబేర్‌మియా తో వివాహమైంది. కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడం మొదలయ్యాయి.

షాహిన్‌ వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో సాబేర్‌మియా ప్రతిరోజు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీంతో ఆమె ఈ నెల 10న గ్రామంలోని పుట్టింటికి చేరుకుంది. సోమవారం రాత్రి సాబేర్‌మియా తన కుమారుడు రహ్మతుల్లా, అన్న షాబుద్దీన్‌, అతని కుమారులు షేక్‌ ఉబేదుల్లా, షేక్‌ కలీముల్లాతో కలిసి షాహిన్‌బేగం వద్దకు వచ్చి దాడి చేశాడు.

ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. బాధితురాలు చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున  మృతి చెందింది.ఐదుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్నేహ వర్ష తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!