తెలంగాణ : రాహుల్ గాంధీకి షాక్.. ఓయూలో కాంగ్రెస్ సభకు అనుమతి నిరాకరణ

Siva Kodati |  
Published : Apr 30, 2022, 02:53 PM IST
తెలంగాణ  : రాహుల్ గాంధీకి షాక్.. ఓయూలో కాంగ్రెస్ సభకు అనుమతి నిరాకరణ

సారాంశం

మే 6న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభకు వర్సిటీ యాజమాన్యం అనుమతి నిరాకరించింది. అంతేకాదు.. క్యాంపస్ ఆవరణలో కెమెరాలను సైతం నిషేధిస్తున్నట్లు తెలిపింది. 

ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరించింది యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. రాహుల్ సభే కాదు.. వర్సిటీలో ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించకుండా నిర్ణయం తీసుకుంది. అంతేకాదు క్యాంపస్‌లో కెమెరాలను నిషేధించారు. మే 6న తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్న రాహుల్ గాంధీ అదే రోజున వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించ‌నున్న భారీ బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌వుతారు. ఆ మ‌రునాడు హైద‌రాబాద్‌లో ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు. ఈ సంద‌ర్భంగా ఓయూలోనూ రాహుల్ గాంధీ కోసం ఓ స‌భ నిర్వ‌హిస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ యూనివ‌ర్సిటీ అధికారుల‌ను కోరింది. ఈ ప్ర‌తిపాద‌న‌పై సుధీర్ఘంగా ఆలోచ‌న చేసిన ఓయూ గ‌వ‌ర్నింగ్ కౌన్నిల్ రాహుల్ గాంధీ స‌భ‌కు అనుమ‌తిని నిరాక‌రిస్తూ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

మరోవైపు.. వరంగల్‌లో (warangal) కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. వరంగల్‌లో ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మే 6న మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి వరంగల్‌కు హెలికాఫ్టర్‌లో వస్తారు రాహుల్ గాంధీ. కాకతీయ యూనివర్సిటీకి చేరుకుని ... అక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ వరకు రాహుల్ గాంధీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఓపెన్ టాప్ వ్యానులో రాహుల్ ర్యాలీ చేపడతారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు రాహుల్ బహిరంగ సభ వుంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 

ఈ సభకు రైతు సంఘర్షణ సభగా నామకరణం చేశారు కాంగ్రెస్ నేతలు. ఓరుగల్లు సభతో రాష్ట్ర రాజకీయాల్లో వైబ్రేషన్స్‌ ఖాయమని చెబుతున్నారు టీపీసీసీ నేతలు. మరోవైపు ఇప్పట్నుంచే రాహుల్‌ సభ కోసం సన్నాహాలు చేస్తున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలు.. బహిరంగ సభా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా రైతులు ఈ బహిరంగ సభకు తరలివస్తారనే అంచనాతో ఉన్న కాంగ్రెస్.. దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పడింది.

టీపీసీసీ (tpcc) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) తో పాటు ముఖ్య నేతలంతా ఈ పనిలోనే తలమునకలై ఉన్నారు. రాహుల్ సభ విజయవంతానికి క్షేత్ర స్థాయిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komatireddy venkat reddy) , ప్రచార కమిటీ ఛైర్మెన్ మధు యాష్కీ (madhu yashki) వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో సభా స్థలి పరిశీలనతో పాటు జిల్లా నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

కాగా.. 2023 లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్ (trs) ను  గద్దె దించడం కోసం అవసరమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలని  ఆ పార్టీ భావిస్తుంది. అయితే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ రేసులో ముందుకు వచ్చింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బీజేపీ (bjp) నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా ఉందని నిరూపించిన పార్టీకే  వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు గంప గుత్తగా షిఫ్ట్ కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Summer Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే న్యూస్.. ఎక్స్ట్రాగా మరో వారం వేసవి సెలవులు, ఎప్పటినుండి ఎప్పటివరకు?
టెన్త్ టాపర్ భవితకు ఊహించని సర్ప్రైజ్! | Komatireddy Venkat Reddy Helps Student Bhavitha