థర్డ్ వేవ్ భయం: కేటుగాళ్ల నయా దందా... పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్, తెరవెనుక కొన్ని ఫార్మా కంపెనీలు

By Siva KodatiFirst Published Jul 17, 2021, 7:31 PM IST
Highlights

కరోనా పేరుతో అక్రమ దందాకు తెరలేపుతున్నారు కొందరు కేటుగాళ్లు. పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటే కోవిడ్‌ను నియంత్రించవచ్చంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇది పచ్చి అబద్ధమని వైద్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు.

థర్డ్ వేవ్ గురించి ప్రజల్లో రోజురోజుకీ ఆందోళన పెరుగుతోంది. పైగా ఈసారి పిల్లలపై ప్రభావం ఎక్కువ ఉంటుందంటూ జరుగుతున్న ప్రచారంతో తల్లిదండ్రుల్లో భయం పెరుగుతోంది. ఈ భయాన్ని కొందరు క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ వేస్తే కరోనా రాదంటూ ప్రచారం చేస్తున్నారు. మాయ మాటలు చెబుతూ .. జేబులు నింపుకునే ప్రయత్నం  చేస్తున్నారు. 

కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌లో వేగం పెంచాయి. 18 ఏళ్లు నిండిన వారందరికి టీకాలు వేస్తున్నారు. అయితే 18 ఏళ్ల లోపు వారికి మాత్రం టీకాలు ఇవ్వడం ఇంకా మొదలుపెట్టలేదు. పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చే అంశం ఇంకా ప్రయోగ దశలోనే వుంది. వ్యాక్సిన్ వేయ్యొచ్చా లేదా అన్న దానిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే కరోనా పేరుతో అక్రమ దందాకు తెరలేపుతున్నారు కొందరు కేటుగాళ్లు.

ALso REad:థర్డ్ వేవ్ దిశగా ప్రపంచం.. అప్రమత్తం కాకుంటే ముప్పు తప్పదు: వీకే పాల్ హెచ్చరికలు

దీనిలో భాగంగానే ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటే కోవిడ్‌ను నియంత్రించవచ్చంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇది పచ్చి అబద్ధమని వైద్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు. ఇది నమ్మి కొందరు తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ వేయించారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు కుమ్మక్కై ప్లూ వ్యాక్సిన్ వేసుకోవాలంటూ ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 
 

click me!