ఈ ఏడాది ‘‘పంచముఖ రుద్ర మహాగణపతి’’గా ఖైరతాబాద్ గణేశ్.. నమూనా ఇదే...!!

By Siva KodatiFirst Published Jul 17, 2021, 7:02 PM IST
Highlights

ఖైరతాబాద్‌ మహాగణపతి ఈసారి ‘‘ పంచముఖ రుద్ర మహాగణపతిగా (ఐదు తలలతో) దర్శనమివ్వనున్నారు. ఎడమ వైపు కాలనాగ దేవత, కుడివైపు కృష్ణ కాళి విగ్రహాలు (15 అడుగులు) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గణేశ్‌ ఉత్సవ విగ్రహ నమూనాను ఖైరతాబాద్‌లోని వినాయక మండపం వద్ద కమిటీ సభ్యులు శనివారం సాయంత్రం ఆవిష్కరించారు.

కరోనా తగ్గుముఖం పట్టడంలో భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి .. హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి వేడుకలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక జంట నగరాలకే ప్రత్యేక ఆకర్షణగా వున్న ఖైరతాబాద్ గణపతిపై ఈసారి అందరి దృష్టి పడింది. గతేడాది కొవిడ్‌ నేపథ్యంలో కేవలం 18 అడుగుల విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. అయితే ఈసారి 40 అడుగుల గణపతి విగ్రహం ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. 

దీనిలో భాగంగానే ఖైరతాబాద్‌ మహాగణపతి ఈసారి ‘‘ పంచముఖ రుద్ర మహాగణపతిగా (ఐదు తలలతో) దర్శనమివ్వనున్నారు. ఎడమ వైపు కాలనాగ దేవత, కుడివైపు కృష్ణ కాళి విగ్రహాలు (15 అడుగులు) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గణేశ్‌ ఉత్సవ విగ్రహ నమూనాను ఖైరతాబాద్‌లోని వినాయక మండపం వద్ద కమిటీ సభ్యులు శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. 

ALso Read:సెప్టెంబర్ 10 నుంచి హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు... నిమజ్జనం ఎప్పుడంటే..?

కాగా, సెప్టెంబర్ 10 నుంచి హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు జరుగుతాయని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ శనివారం ప్రకటించింది. సెప్టెంబర్ 19న గణేశ్ నిమజ్జనం చేస్తామని కమిటీ వెల్లడించింది. గణేశ్ విగ్రహాల తయారికీ కావాల్సిన ముడిపదార్థాలను ప్రభుత్వం అందించాలని కమిటీ సభ్యులు కోరారు. అలాగే గణేశ్ నిమజ్జనానికి వెళ్లే మార్గాలను బల్దియా అధికారులు బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

click me!