హమాలీ వ్యాఖ్యలు.. మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం, కేబినెట్ నుంచి బర్తరఫ్‌కు డిమాండ్

By Siva KodatiFirst Published Jul 17, 2021, 6:19 PM IST
Highlights

మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుద్యోగులను హమాలీ పనిచేసుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేయడంతో పాటు కేబినెట్  నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తోంది.

మంత్రి నిరంజన్ రెడ్డి నాగర్ కర్నూల్‌లో నిరుద్యోగ యువత పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి నిరసనగా శనివారం తెలంగాణ జనసమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు కంతి రమేష్ , జిల్లా తెజస పార్టీ కార్యదర్శి చింతకుంట శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగ కల్పన చేయాల్సింది పోయి నిరుద్యోగులను హేళన చేసి మాట్లాడడం దురదృష్టకరమన్నారు.

ALso Read:చదువుకున్నోళ్లందరికీ సర్కారీ నౌకరీ రాదు: మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

వెంటనే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేసి  భర్తీ ప్రక్రియ చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగ భర్తీ క్యాలండర్ విడుదల చేయాలని కోరారు. బేషరతుగా నిరుద్యోగ యువతకు మంత్రి నిరంజన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి తెజస నాయకుడు డిమాండ్ చేశారు. పోరాడి తెచుకొన్న తెలంగాణలో విద్యార్థి, నిరుద్యోగుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం ఉదాసీనవైఖరి అవలంబించడం తగదని వారు హితవు పలికారు. వెంటనే మంత్రి వ్యాఖ్యలపై గవర్నర్ జోక్యం చేసుకొని బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న నిరంజన్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు

click me!