కేసీఆర్‌కు షాక్: కాళేశ్వరంపై తేల్చేసిన గడ్కరీ

By narsimha lodeFirst Published Aug 10, 2018, 11:45 AM IST
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టుకు  జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ  స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చాలా కాలంగా  తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.  అయితే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన తెలంగాణ సర్కార్‌కు షాకిచ్చింది.
 


న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు  జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ  స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చాలా కాలంగా  తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.  అయితే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన తెలంగాణ సర్కార్‌కు షాకిచ్చింది.

లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో గురువారం నాడు ఎంపీ సలీం అడిగిన ప్రశ్నకు  కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారంగా  పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్టు ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో  మరే ఇతర ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా  ఇచ్చేది లేదన్నారు. 

కేంద్ర మంత్రి గడ్కరీ సమాధానం పట్ల టీఆర్ఎస్ ఎంపీలు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  గడ్కరీ సమాధానం పట్ల  టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మంత్రి సమాధానాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. 

ఈ విషయమై మంత్రి గడ్కరీకీ టీఆర్ఎస్ ఎంపీ  వినోద్  లేఖ రాశారు. ఈ లేఖలో మంత్రి సమాధానం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారంగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ లలో ఏదో ఒక  ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని  ఉన్న విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీ వినోద్  ఆ లేఖలో ప్రస్తావించారు.ఏపీ విభజన చట్టం  ప్రకారంగా  తెలంగాణలోని  ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. 
 

click me!