డెడ్ బాడీ తరలించేందుకు డబ్బుల్లేక ఆసుపత్రిలోనే శవం: మంచిర్యాలలోనే యూపీ వాసి మృతదేహాం

Published : May 01, 2022, 09:50 AM ISTUpdated : May 01, 2022, 10:08 AM IST
డెడ్ బాడీ తరలించేందుకు డబ్బుల్లేక ఆసుపత్రిలోనే శవం: మంచిర్యాలలోనే యూపీ వాసి మృతదేహాం

సారాంశం

అనారోగ్యంతో మరణించిన తన సోదరుడి మృతదేహాన్ని తరలించే డబ్బులు లేకపోవడంతో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలోనే డెడ్ బాడీని వదిలివేశాడు సోదరుడు. యూపీకి చెందిన మోతీషా మరణించడంతో మంచిర్యాల నుండి యూపీకి ఈ డెడ్ బాడీని తరలించే డబ్బులు లేకపోవడంతో శవాన్ని అక్కడే వదిలివెళ్లాడు.

బెల్లంపల్లి: Dead Body ని తరలించేందుకు Private Ambulance కు రూ. 80 వేలు చెల్లించే స్థామత లేకపోవడంతో మృతదేహాన్ని  Bellampalli ఆసుపత్రిలోనే వదిలివెళ్లిన ఘటన వెలుగు చూసింది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన Moti Shah తన సోదరుడితో కలిసి ఏప్రిల్ 28 Trainలో ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో మోతీ షాకు వడదెబ్బ తగిలింది.తీవ్ర అస్వస్థతకు గురైన మోతీ షాను అతని వెంటనే సోదరుడు మంచిర్యాల జిల్లాలోన బెల్లంపల్లి ఆసుపత్రిలో చేర్పించాడు.

బెల్లంపల్లి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అక్కడి వైద్యుల సూచన మేరకు మోతీషాను Mancherial జిల్లాకేంద్ర ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరిన రెండు గంటలకే మోతీషా మరణించాడు.  మోతీ షా డెడ్ బాడీని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు మోతీషా ప్రైవేట్ అంబులెన్స్ లను సంప్రదించాడు. Uttar pradeshకి ఈ డెడ్ బాడీని తరలించాలంటే రూ. 80 వేలు డిమాండ్ చేశారు.

ఆ డబ్బు చెల్లించే స్థోమత లేకపోవడంతో సోదరుడు మోతీ షా డెడ్ బాడీని ఆసుపత్రిలోనే వదిలేశాడు.  ఈ డెడ్ బాడీని తీసుకెళ్లాలని మోతీ షా సోదరుడికి ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేశారు. అయితే అతను స్పందించలేదు. ఈ విషయమై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మోతీ షా సోదరుడి కోసం విచారణ చేస్తున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా అరాచకం వెలుగు చూసింది పదేళ్ల బాలుడి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు రూ. 20 వేలు  డిమాండ్ చేయడంతో 90 కి.మీ దూరంలోని తన స్వగ్రామానికి ఓ వ్యక్తి తన కొడుకు డెడ్ బాడీని బైక్ పై తీసుకెళ్లాడు.

తిరుపతి రుయా ఆసుపత్రిలో అన్నమయ్య  జిల్లాలోని చిట్వేల్  కు చెందిన ఓ వ్యక్తి తన పదేళ్ల కొడుకుకు కిడ్నీ సంబంధిత చికిత్స కోసం ఏప్రిల్ 26న  చేర్పించాడు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పదేళ్ల బాలుడు చనిపోయాడు. ఈ Dead Body ని తీసుకెళ్లేందుకు Ambulance మాఫియా ఇష్టారీతిలో డబ్బులు డిమాండ్ చేశారు. చనిపోయిన బాలుడి తండ్రి బయటి నుండి మరో అంబులెన్స్ ను తీసుకొచ్చినా కూడా స్థానికంగా ఉన్న అంబులెన్స్ డ్రైవర్లు అనుమతించలేదు. బయటి నుండి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ పై దాడికి ప్రయత్నించారు.  ఈ ఘటన ఏపీ రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ విషయమై  ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొంది. ఆర్ఎంఓను సస్పెండ్ చేసింది. రుయా ఆసుపత్రి సూపరింటెండ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 

ఏడాదిన్నర క్రితం కూడా ఇదే తరహా ఘటనలు రుయా ఆసుపత్రిలో చోటు చేసుకొంది. ఆ సమయంలో కూడా పోలీసులు కేసులు నమోదు చేయడంతో కొంతకాలం పాటు ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా ఆగడాలు నిలిచిపోయాయని పోలీసులు చెబుతున్నారు.

రుయా ఆసుపత్రి ఘటనకు సంబంధించి అంబులెన్స్ ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ నిర్ణయించిన మేరకే డబ్బులు వసూలు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.
 

PREV
click me!

Recommended Stories

Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu
KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu