
హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీ.కాంగ్రెస్ కీలక సమావేశం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి 9 మంది ముఖ్యనేతలు హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌లతో పాటు ఏఐసీసీ వ్యూహకర్త.. సునీల్ కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. పార్టీలో నేతల మధ్య సమన్వయం, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.
మరోవైపు.. టీ కాంగ్రెస్ తదుపరి కార్యచరణపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. త్వరలో తెలంగాణకు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించబోతోన్న నేపథ్యంలో పార్టీలో ఏర్పడిన లుకలుకలు క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న కూడా కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోమటిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో హైకమాండ్ ఎదైనా కఠిన నిర్ణయం తీసుకోబోతుందా అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. అయితే ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.
కాగా.. నల్గొండ జిల్లాలోని Nagarjuna Sagar లో టీపీసీసీ చీఫ్ Revanth Reddy సమావేశం నిర్వహించవద్దని Congress పార్టీ స్టార్ క్యాంపెయినర్ Komatireddy Venkat Reddy చేసిన వ్యాఖ్యలపై ఎఐసీసీ ఆరా తీసిన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ ను ఎఐసీసీ సెక్రటరీ బోస్ రాజు పార్టీ నాయకత్వానికి పంపారు.
Nalgonda లో రేవంత్ రెడ్డి సమావేశం అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది మే 6న Warangal లో Rahul Gandhi సభ కు జన సమీకరణకు గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తన వంటి ఫహిల్వాన్ లాంటి నేతలు ఉన్నారని ఆయన చెప్పారు. పార్టీ బలహీనంగా ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటించాలని ఆయన సూచించారు.
నాగార్జునసాగర్ సమావేశం కంటే మూడు రోజుల ముందే నల్గొండలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం గురించి తమకు సమాచారం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, Uttam kumar Reddy లు సమావేశాన్ని రద్దు చేయించారు. ఈ విషయమై Jana Reddy తో చర్చించారు. అయితే పీసీసీ చీఫ్ ను జిల్లా పర్యటనకు రాకుండా అడ్డుకోవడం సమంజసమా అని జానారెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు నాగార్జునసాగర్ లోనే జానారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటనకు తాను వెళ్తున్నందున నాగార్జునసాగర్ టూర్ కి తాను హాజరు కాబోనని రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మేసేజ్ పంపారు. ఇదిలా ఉంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించొచ్చని ఎఐసీసీ సెక్రటరీ బోస్ రాజ్ తేల్చి చెప్పారు.ఎవరి అనుమతిని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు.