ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్ వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దు: తెలంగాణ హైకోర్టు

Published : Sep 08, 2023, 03:26 PM IST
ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్    వినాయక విగ్రహాలను  హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దు: తెలంగాణ హైకోర్టు

సారాంశం

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని తెలంగాణ హైకోర్టు  తేల్చి చెప్పింది.

హైదరాబాద్: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో  నిమజ్జనం చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనంపై గత ఏడాది ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు తెలిపింది.ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని తయారీదారులు  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కేంద్ర పీసీబీ నిబంధనలు కొట్టివేయాలని తయారీదారుల పిటిషన్ దాఖలు చేశారు.

పీవోపీ విగ్రహాలు  హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని గత ఏడాది హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పీఓపీ విగ్రహాలు కృత్రిమ కొలనుల్లో నిమజ్జనం చేయాలని గత ఏడాదే తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.గత ఏడాది జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయని  హైకోర్టు స్పష్టం చేసింది. గత ఏడాది  కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి  హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాలను  నిమజ్జనం చేశారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.  ఆధారాలతో  కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు హామీ ఇచ్చింది.
ఈ పిటిషన్ పై విచారణను  ఈ నెల  25వ తేదీకి  హైకోర్టు వాయిదా వేసింది.

ఈ నెల  28వ తేదీన వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహించాలని  గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల  18న వినాయక చవితిని నిర్వహించనున్నారు.  ఈ నెల  28న  హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ సహా పలు ప్రాంతాల్లో  వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech |అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Revanth Reddy vs KCR
Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu