హోంగార్డు రవీందర్ కుటుంబానికి పలు పార్టీలు సంఘీభావం తెలిపాయి. రవీందర్ మృతికి ప్రభుత్వమే కారణమని విపక్షాలు ఆరోపించాయి.
హైదరాబాద్: హోంగార్డు రవీందర్ భార్య సంధ్యతో పోలీసు ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారంనాడు మృతి చెందాడు. రవీందర్ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం హైద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రవీందర్ మృతదేహనికి పోస్టుమార్టం చేయడానికి ఆయన కుటుంబ సభ్యుల సంతకం అవసరం. అయితే పోస్టు మార్టం కోసం సంతకం చేయడానికి రవీందర్ భార్య నిరాకరిస్తున్నారు. రవీందర్ ఆత్మహత్య చేసుకోలేదని రవీందర్ భార్య సంధ్య ఆరోపిస్తున్నారు. రవీందర్ పై పెట్రోల్ పోసి హత్య చేశారని ఆరోపించారు. కానిస్టేబుల్ చందు, ఎఎస్ఐ నర్సింగరావుపై సంధ్య ఆరోపణలు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరో వైపు హోంగార్డు కార్యాలయం వద్ద సీసీటీవీ పుటేజీని బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం నుండి స్పష్టతను కోరుతుంది.ఈ విషయమై స్పష్టత వచ్చాకే పోస్టుమార్టం కోసం అనుమతికై సంతకం చేయనున్నట్టుగా ఆమె చెప్పారు.
దీంతో ఉస్మానియా ఆసుపత్రి వద్ద సంధ్య కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రవీందర్ కుటుంబానికి పలు పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రవీందర్ కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడ సంధ్యకు మద్దతు ప్రకటించారు.రవీందర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
also read:నా భర్తను హత్య చేశారు: హోంగార్డు రవీందర్ భార్య సంధ్య
ఇదిలా ఉంటే రవీందర్ మృతదేహనికి పోస్టుమార్టం కోసం సంధ్యను ఒప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్థానిక పోలీసు ఉన్నతాధికారులు సంధ్యతో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే తన భర్త మృతికి గల కారణాలను బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. తన భర్త రవీందర్ ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేశారని ఆమె ఆరోపిస్తున్నారు.