పార్టీ మార్పుపై తేల్చేసిన సర్వేసత్యనారాయణ

Published : Jun 23, 2019, 01:44 PM IST
పార్టీ మార్పుపై తేల్చేసిన సర్వేసత్యనారాయణ

సారాంశం

తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ఎవరూ కూడ తనను సంప్రదించలేదన్నారు.  

హైదరాబాద్: తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ఎవరూ కూడ తనను సంప్రదించలేదన్నారు.

ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుడు వార్తలను ఖండిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. తాను ఎప్పటికీ కూడ కాంగ్రెస్ మనిషినేనని ఆయన చెప్పారు. బీజేపీలో చేరుతున్నట్టుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. 

రాహుల్‌ను ప్రధానమంత్రిగా చేయడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు.  తాను జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే  కొనసాగుతానని ఆయన చెప్పారు.  కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై సర్వే సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయనను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్