మేల్కొన్న కాంగ్రెస్ అధిష్టానం: టీపీసీసీ ప్రక్షాళన, కొత్త చీఫ్‌గా శ్రీధర్ బాబు..?

Siva Kodati |  
Published : Jun 23, 2019, 12:25 PM ISTUpdated : Jun 23, 2019, 12:28 PM IST
మేల్కొన్న కాంగ్రెస్ అధిష్టానం: టీపీసీసీ ప్రక్షాళన, కొత్త చీఫ్‌గా శ్రీధర్ బాబు..?

సారాంశం

ఇతర పార్టీల్లోకి వలసలతో పాటు సీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనమవుతుండటంతో టీపీసీసీపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిసారించింది

ఇతర పార్టీల్లోకి వలసలతో పాటు సీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనమవుతుండటంతో టీపీసీసీపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిసారించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలంతా పార్టీ ఎందుకు మారారని తెలంగాణ పెద్దలను అధిష్టానం ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. పార్టీ నేతలకు రాష్ట్రంలోని పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీని ప్రక్షాళన చేయ్యాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.

ఎప్పటి నుంచో పార్టీ జెండాను మోస్తున్న వీర విధేయులకే టీపీసీసీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ రేసులో ముందుగా శ్రీధర్ బాబు పేరు వినిపిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Home: మెట్రో దగ్గర ఇల్లు ఉంటే EMI భారం తగ్గుతుంది.. ఇదెక్కడి లాజిక్ అని ఆలోచిస్తున్నారా.?
Medaram Jatara: మేడారం వెళ్లలేక‌పోతున్నారా.? ఏం ప‌ర్లేదు ప్ర‌సాదం మీ ఇంటికే వ‌స్తుంది. ఎలాగంటే..