హైద్రాబాద్‌లో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. హైద్రాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చామని కేసీఆర్ తెలిపారు.
హైదరాబాద్:హైద్రాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చినట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు..హైద్రాబాద్ మెట్రో రెండో దశకు శుక్రవారంనాడు శంకుస్థాపన చేసిన తర్వాత అప్పా జంక్షన్ వద్ద నిర్వహించిన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని పవర్ స్టేషన్లతో, స్టేట్ ఎలక్ట్రిసిటి గ్రిడ్ లతో హైద్రాబాద్ ను అనుసంధానించినట్టుగా కేసీఆర్ తెలిపారు. అంతేకాదు భారతదేశ ఎలక్ట్రిక్ గ్రిడ్ తో హైద్రాబాద్ నగరం కనెక్ట్ అయిందన్నారు.
న్యూయార్క్,ఫారిస్ లలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. కానీ హైద్రాబాద్ లో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేసినట్టుగా కేసీఆర్ వివరించారు. హైద్రాబాద్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయమే ఉండదని కేసీఆర్ తేల్చి చెప్పారు. 1912లోనే హైద్రాబాద్ లో విద్యుత్ సదుపాయం ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
undefined
హైద్రాబాద్ నగరం సుప్రసిద్ద నగరమన్నారు. ఢిల్లీ కంటే వైశాల్యం, జనాభాలో హైద్రాబాద్ ఒకప్పుడు పెద్ద నగరంగా ఉందని చరిత్ర చెబుతుందని ఆయన గుర్తు చేశారు. గతంలో విద్యుత్ కష్టాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఒక్కొక్క సమస్యను తీర్చుకొంటూ వెళ్తున్నామన్నారు సమశీతల వాతావరణం ఉన్న నగరంగా హైద్రాబాద్ ఉందని సీఎం చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అభివృద్ది ఆగదని కేసీఆర్ తెలిపారు.
హైద్రాబాద్ చుట్టూ మెట్రో రైలును విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. బీహెచ్ఈఎల్ తో పాటు ఔటర్ రింగ్ చుటూ మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించాల్సిన అవసరాన్ని కేసీఆర్ నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా హైద్రాబాద్ చుట్టూ మెట్రోను విస్తరిస్తామని కేసీఆర్ ప్రకటించారు.
also read:రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో పనులు: శంకుస్థాపన చేసిన కేసీఆర్
హైద్రాబాద్ ఎయిర్ పోర్టుకి మెట్రో ద్వారా కనెక్టివిటీని పెంచుతున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. అందరికీ అనువైన వాతావరణం హైద్రాబాద్ లో ఉందన్నారు. చాలా సురక్షితమైన నగరం హైద్రాబాద్ గా కేసీఆర్ పేర్కోన్నారు. అన్ని భాషలు, సంస్కృతులు, కలిసున్న నగరం హైద్రాబాద్ అని కేసీఆర్ వివరించారు.