రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో పనులు: శంకుస్థాపన చేసిన కేసీఆర్

By narsimha lodeFirst Published Dec 9, 2022, 11:39 AM IST
Highlights

హైద్రాబాద్ మెట్రో  రెండో దశ పనులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారంనాడు శంకుస్థాపన చేశారు. రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు 31 కి.మీ. దూరం పనులను రూ. 6,250 కోట్లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


హైదరాబాద్:  హైద్రాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా  రెండో దశ పనులకు తెలంగాణ సీఎం కేసీఆర్  శుక్రవారంనాడు శంకుస్థాపన చేశారు.రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు  31 కి.మీ  రూ. 6,250 కోట్లతో ఈ పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాయదుర్గం వద్ద మెట్రో విస్తరణ పనులకు కేసీఆర్ ఇవాళ భూమి పూజ నిర్వహించారు. ఈ మార్గంలో .31 నిమిషాల్లో రాయదుర్గం నుండి శంషాబాద్  కు వెళ్లవచ్చు. త్వరగా  ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు  ఈ మెట్రో రైలు దోహదపడుతుంది. అందుబాటులో ఉన్న అత్యాధునికి టెక్నాలజీని  ఈ మెట్రో రైలు నిర్మాణంలో ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  సుమారు  రెండున్నర కిలోమీటర్ల మేర భూగర్భమార్గంలో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్ పోర్టుకు సమీపంలో  ఆకాశ మార్గంలో మెట్రో రైలును అనుమతించే అవకాశం లేదు. దీంతో  ఈ ప్రాంతంలో  భూగర్భమార్గంలో రైలు మార్గం ఏర్పాటు చేయనున్నారు.ప్రయాణీకులు వెళ్లే రైళ్ల కోసం ఒక లైన్, కార్గో రైళ్ల కోసం  మరో  మార్గాన్ని  ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది.

 

Live: CM Sri KCR laying foundation stone for the to Airport. https://t.co/yFcgN5DP0K

— Telangana CMO (@TelanganaCMO)

మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రైవేట్ , ప్రభుత్వ భాగస్వామ్యంతో  హైద్రాబాద్ మెట్రో రైల్వే ప్రాజెక్టు తొలి దశ  పనులు ప్రారంభమయ్యాయి. అయితే  రెండో దశలో భాగంగా రాయదుర్గం నుండి శంషాబాద్  వరకు విస్తరించే ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం  స్పెషల్  పర్సస్ వెహికల్  హైద్రాబాద్  ఎయిర్ పోర్ట్  మెట్రో లిమిటెడ్ ను  ఏర్పటు చేసింది.  విమానాశ్రయం, మెట్రో లింక్, అభివృద్ది , నిర్మాణం, నిర్వహణను హచ్ఏఎంఎల్  పర్యవేక్షించనుంది.

also read:కొత్త మెట్రో లైన్ తో ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ పన్నాగం: కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి

మెట్రో తొలి దశలో  ప్రభుత్వ, ప్రైవేట్  భాగస్వామ్యంతో నిర్మించారు.  తొలిదశలో మూడు కారిడార్లున్నాయి.  మొత్తం 2600 పిల్లర్లున్నాయి.  ప్రతి రోజూ  నాలుగు లక్షల మంది మెట్రో రైలు ద్వారా  తమ గమ్యస్థానాలకు  చేరుకుంటున్నారు.  హైద్రాబాద్ లో మెట్రో అందుబాటులోకి రావడంతో  ట్రాఫిక్ సమస్యలు తగ్గాయి.  త్వరగా తమ గమ్యస్థానాలకు  ప్రయాణీకులు చేరుకుంటున్నారు. 

click me!