వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల

By narsimha lode  |  First Published Jul 8, 2022, 4:08 PM IST

తెలంగాణలో ఎన్నికలకు ఆరు మాసాల ముందు రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరుగుతాయని వైఎస్ఆర్‌టీపీ చీప్ వైఎస్ షర్మిల చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.


హైదరాబాద్: Telangana లో  ఎన్నికలకు ఆరు మాసాల ముందే రాజకీయ సమీకరణాలు మారుతాయని YSRTP చీఫ్ YS Sharmila  చెప్పారు.తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని చెప్పారు. 

శుక్రవారంనాడు హైద్రాబద్ లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.తెలంగాణలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు జరుగుతాయని ఆమె చెప్పారు. BRS అనేది తుగ్లక్ ఆలోచనగా ఆమె అభివర్ణించారు.  తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తామని షర్మిల ప్రకటించారు.  వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఆమె తేల్చి చెప్పారు. ఒంటరిగాన తాము అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతామన్నారు.

Latest Videos

undefined

సరిగ్గా గత ఏడాది జులై 8న వైఎస్సార్ టీపీని షర్మిల స్థాపించారు. పార్టీ స్థాపించిన తొలి రోజు నుంచి షర్మిల అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్ష చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతాంగం కోసం పరామర్శ యాత్ర, చిన్నారులపై లైంగిక దాడుల సందర్భంగా నిరసనలు.. ఇలా అన్ని సందర్భాల్లో ప్రభుత్వ వైఫల్యాలనుషర్మిల గట్టిగా నిలదీస్తున్నారు. 3500 కిలోమీటర్ల ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించి 116 రోజుల్లో 1500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేసిన షర్మిలకు గ్రామ గ్రామాన విశేష ఆదరణ లభిస్తోంది. ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. సీఎం KCR ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా చేసిన వాగ్దానాలలో వేటినీ పూర్తి చేయని విషయాన్ని ఆమె ప్రజలకు గుర్తు చేస్తున్నారు. 

గత ఏడాదిన ఇదే రోజున వైఎస్ఆర్‌టీపీని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఏడాదిలో తమ పార్టీ ప్రజల కోసం పనిచేసిందన్నారు. ప్రతి మంగళవారం నాడు నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయకుండా తమను అడ్డుకున్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తన పోరాటం ఆగదన్నారు.

ఏడాది కాలంలో తమ పార్టీ చేపట్టిన అనేక ఉద్యమాలకు, పోరాటాలకు మద్దతు తెలిపిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు  ఆమె ధన్యవాదాలు చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్ల తరఫున నిలబడ్డ ఏకైక పార్టీ  వైఎస్ఆర్ పార్టీయేనన్నారు. తమ పోరాటంతోనే  కేసీఆర్  సర్కార్  80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిందన్నారు. రైతుల తరఫున పోరాటం చేశాం. రైతు ఆవేదన యాత్ర, రైతు గోస దీక్షలు చేపట్టామన్నారు.  దళితుల కోసం దళిత భేరి, బీసీల కోసం బీసీ సభ నిర్వహించామన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో అనేక సమస్యలను ఎత్తిచూపినట్టుగా షర్మిల వివరించారు.

YSR  సీఎంగా ఉన్న సమయంలో TRS  పార్టీకి స్థలం కేటాయించిందన్నారు.  కానీ వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కేటాయించిన స్థలాన్ని కేసీఆర్ సర్కార్ వెనక్కి తీసుకోవడం ఆయనను అవమానించడమేనని షర్మిల అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం వల్లే ఆ పార్టీ బలం పెరిగిందన్నారు. 2004లో టీఆర్ఎస్ బలమెంత అని ఆమె అడిగారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వల్లే టీఆర్ఎస్ బలం పెరిగిందని ఆమె చెప్పారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో Congress పార్టీని రెండు సార్లు అధికారంలోకి వైఎస్ఆర్ తీసుకు వచ్చారన్నారు. ఏపీ రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు వైఎస్ఆర్ కారణమని ఆమె గుర్తు చేశారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ను గౌరవించలేదన్నారు. వైఎస్ఆర్ ను స్మరించుకొనేందుకు ఎలాంటి స్మారక కేంద్రం 

వైఎస్ఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గారి పేర్లు పెట్టారన్నారు.కానీ  వైఎస్ ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, మంత్రులు ఒక్క పథకానికైనా వైఎస్ఆర్ పేరు పెట్టారా? అని ఆమె అడిగారు.  వైఎస్ ఆర్ కోసం ఒక్క పని చేయకపోగా మరణించిన వ్యక్తి పై  ఎఫ్ ఐఆర్ లో వైఎస్ఆర్ పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చిందని ఆమె విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కి  వెన్నుపోటు పొడిచిందన్నారు. అందుకే.కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందన్నారు. కేసీఆర్ కు వైఎస్ఆర్ పేరు నిల‌బ‌డాలనే ఉద్దేశం లేదన్నారు.వైఎస్ఆర్ పేరు కోసం ప‌నిచేస్తామ‌ని రేవంత్ రెడ్డి చెబుతున్న దొంగ మాట‌లు న‌మ్మే వారు లేరని షర్మిల అభిప్రాయపడ్డారు.Revanth Reddy  ఒక దొంగ‌, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వాడని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

also read:2004లో టీఆర్ఎస్ బలమెంత: కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పై వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్

తెలంగాణ వ‌స్తే వీసాలు తెచ్చుకోవాల‌ని వైఎస్ ఆర్  అనడం వెనుక కారణాన్ని ఆమె వివరించారు. కేసీఆర్ రెచ్చ‌గొట్టే ప్ర‌సంగం వ‌ల్లే వైయ‌స్ఆర్ అలా మాట్లాడాల్సి వ‌చ్చిందన్నారు. .వైఎస్ఆర్ చెప్పిన మాట‌లే వినిపిస్తున్నాయి కానీ కేసీఆర్ చెప్పిన మాట‌లు వినిపించ‌వా? షర్మిల ప్రశ్నించారు. ఆంధ్రా సంస్థ‌ల‌ను పంపిస్తాం, ఆంధ్రా వాళ్ల‌ను వెళ్ల‌గొడ‌తాం అని కేసీఆర్ అంటేనే వైఎస్ఆర్ అలా మాట్లాడాల్సి వ‌చ్చిందని షర్మిల వివరించారు.

click me!