ఆ 1350 ఎకరాలు ప్రభుత్వానివే : దేవరయాంజల్ భూములపై సర్కార్‌కు కమిటీ నివేదిక

By Siva KodatiFirst Published Nov 15, 2022, 3:56 PM IST
Highlights

మేడ్చల్ జిల్లాలోని దేవరయాంజల్ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. నిర్మాణాలను తొలగించి భూములు స్వాధీనం చేసుకోవాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. 
 

మేడ్చల్ జిల్లాలోని దేవరయాంజల్ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. మొత్తం 1350 ఎకరాలు దేవాలయానికి చెందినవేనని తేల్చింది . భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేశారని... నిర్మాణాలను తొలగించి భూములు స్వాధీనం చేసుకోవాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. 

కాగా.. దేవరయాంజల్ సీతారామస్వామి ఆలయానికి చెందిన భూముల్లో కబ్జాలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నలుగురు ఐఏఎస్ అధికారులతో సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఇతరులు చేసిన ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో కోరింది. 
 

click me!