డెక్కన్ మాల్ లో డెడ్ బాడీలను గుర్తించలేదు: జిల్లా కలెక్టర్

By narsimha lode  |  First Published Jan 20, 2023, 4:46 PM IST

సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్  భవనంలో  డ్రోన్ కెమెరాలతో  అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 


హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్  భవనంలో   డ్రోన్ల ద్వారా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ భవనంలో  ఏ అంతస్తులో   ఏ రకమైన   పరిస్థితి ఉందనే విషయమై   అధికారులు  ఆరా తీస్తున్నారు.   ఈ భవనంలో  పరిస్థితిని  జిల్లాకలెక్టర్ ఆమోయ్ కుమార్  శుక్రవారం నాడు పరిశీలించారు. భవనంలోని ప్రతి  అంతస్థులో  పరిస్థితిని డ్రోన్ కెమెరా ద్వారా  అధికారులు పరిశీలించారు. 

ఈ భవనంలలోని రెండో అంతస్థులో రెండు మృతదేహలను గుర్తించినట్టుగా  కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. అయితే  ఈ భవనంలో ఎలాంటి మృతదదేహలు  ఇప్పటివరకు గుర్తించలేదని కలెక్టర్ ప్రకటించారు. మృతదేహలు కానీ ఇతర విషయాలను గుర్తిస్తే  తాము ప్రకటిస్తామని కలెక్టర్  తేల్చి చెప్పారు. ఈ భవనం నుండి ఇంకా పొగ వస్తుంది.  ఈ పొగ నాలుగైదు గంటల తర్వాత  తగ్గిపోయే అవకాశం ఉందని కలెక్టర్  చెప్పారు.  పొగ తగ్గిన తర్వాత   ఈ భవనంలో  ఏముందనే విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.ఈ భవనాన్ని  పరిశీలించిన  నిట్ డైరెక్టర్  ఇంకా  నివేదికను ఇవ్వాల్సి ఉందని  కలెక్టర్  తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా  ఏం చేయాలనే దానిపై  నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్  వివరించారు.

Latest Videos

also read:షార్ట్ సర్క్యూట్ కారణం కాదు: రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదంపై విద్యుత్ శాఖాధికారి శ్రీధర్

నిన్న ఉదయం  డెక్కన్ మాల్ లో  అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి  ఎనిమిది  గంటల సమయంలో అతి కష్టం మీద  మంటలను ఆర్పివేశారు. అయితే  ఇవాళ ఉదయం  ఈ భవనం సెల్లార్ లో   మంటలు చెలరేగాయి.  ఈ భవనంలో నిల్వ ఉంచిన  సింథటిక్ మెటీరియల్  కారణంగా  మంటల తీవ్రత  ఎక్కువగా  ఉందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. మంటల ధాటికి  స్లాబ్ లు కూలి మెటీరి యల్ పై పడినట్టుగా  ఫైర్ ఫైటర్లు చెబుతున్నారు.  నిన్నటి నుండి  ఈ భవనంలో మంటలు ఉన్న కారణంగా  ఇవాళ భవనం మొత్తం  దెబ్బతిందని  అధికారులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన  భవనంలో ముగ్గురు కార్మికులు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయమై  ఇంకా నిర్ధారణ చేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఈ భవనంలోపలే  సెల్ ఫోన్ సిగ్నల్స్ ను పోలీసులు గుర్తించారు.  


 

click me!