మైనింగ్ యూనివర్సిటీ మాటే లేటు

First Published Feb 1, 2017, 11:34 AM IST
Highlights
  • బడ్జెట్లో మైనింగ్ యూనివర్సిటీ, ఏయిమ్స్ ల ప్రస్తావనే లేదు

విద్యా వైద్యం తమ ప్రథమ ప్రాధాన్య అంశాలుగా చెప్పుకున్న ఎన్డీయే ప్రభుత్వం తీరా అసలు సమయానికి వచ్చేసరికి చెయ్యి ఇచ్చింది. ముఖ్యంగా బడ్జెట్ లో తెలంగాణ కు ఈసారి ప్రాధాన్యమే దక్కకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్న కేంద్ర వర్సిటీలకు ఏదో టిప్పు ఇచ్చినట్లు కొద్ది మొత్తం కేటాయించారు.

 

పునర్వభజన చట్టంలో పేర్కొన్న మైనింగ్ వర్సిటీ, ఏయిమ్స్ ఏర్పాటుపై ప్రకటన కూడా వినిపించలేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ట్రైబుల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినా దానికి కేవలం రూ. 10 కోట్లు మాత్రమే కేటాయించారు.

 

ఉన్నంతలో ఐఐటీ హైదరాబాద్ కే కాస్త ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. ఈ వర్సిటీకి బడ్జెట్ లో రూ. 75 కోట్లు కేటాయించారు. అయితే మైనింగ్ వర్సిటీ, ఏయిమ్స్ పై ప్రస్తావించకపోవడం తెలంగాణ ఎంపీలను నిరాశపరిచిందది.

click me!