వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులుండవు: వైఎస్ షర్మిల

Published : Mar 25, 2021, 01:47 PM ISTUpdated : Mar 25, 2021, 01:53 PM IST
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులుండవు: వైఎస్ షర్మిల

సారాంశం

 వచ్చే ఎన్నికల్లో తమకు ఎవరితో పొత్తులు ఉండవని వైఎఏస్ షర్మిల ప్రకటించారు.

అమరావతి: వచ్చే ఎన్నికల్లో తమకు ఎవరితో పొత్తులు ఉండవని వైఎఏస్ షర్మిల ప్రకటించారు.రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో హైద్రాబాద్ లోటస్‌పాండ్ లో ఆమె గురువారం నాడు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. టీఆర్ఎస్, బీజేపీ చెబితే వచ్చినవాళ్లం కాదన్నారు.ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు చెందిన పోస్టర్, కరపత్రాన్ని ఆమె విడుదల చేశారు.

ఈ సభ నిర్వహణకు ఖమ్మం పోలీసుల  నుండి షర్మిల అనుచరులు అనుమతి తీసుకొన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ సభను నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు.ఈ సభలోనే పార్టీ  పేరును కూడ షర్మిల ప్రకటించే అవకాశం ఉంది. ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని షర్మిల భావిస్తున్నారు. ఈ సభ గురించి పార్టీ నేతలతో ఆమె చర్చించారు.

కొన్ని రోజులుగా  రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో రాజకీయ పరిస్థితులపై ఆమె చర్చిస్తున్నారు. ఏ రకమైన సమస్యలు ఉన్నాయనే విషయాలపై ఆమె ఆరా తీస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?