బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే .. మా స్ట్రాటజీ మాకుంది : ధర్మపురి అర్వింద్

Siva Kodati |  
Published : Jun 27, 2023, 06:33 PM ISTUpdated : Jun 27, 2023, 06:35 PM IST
బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే .. మా స్ట్రాటజీ మాకుంది : ధర్మపురి అర్వింద్

సారాంశం

బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని.. రాష్ట్రంలో కాంగ్రెస్ అసలుందా అని  బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. అమిత్ షా కేటీఆర్‌తో భేటీ అయ్యారని రేవంత్‌కు ఎవరు చెప్పారని ధర్మపురి ప్రశ్నించారు.

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన నేపథ్యంలో స్పందించారు బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. మంగళవారం ఆర్మూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో భారీ చేరికలంటూ జరుగుతున్న ప్రచారం మీడియా సృష్టేనన్నారు. సీఎం కేసీఆర్ పనిగట్టుకుని కాంగ్రెస్‌కు హైప్ వచ్చేలా చేస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరినా.. ఖమ్మం మెజార్టీ స్థానాల్లో బీజేపీయే గెలుస్తుందని, ఇందుకు మా స్ట్రాటజీ మాకుందని ఆయన పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని.. రాష్ట్రంలో కాంగ్రెస్ అసలుందా అని అర్వింద్ ప్రశ్నించారు. ఢిల్లీలో అమిత్ షాతో కేటీఆర్ భేటీ అయ్యారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. అమిత్ షా కేటీఆర్‌తో భేటీ అయ్యారని రేవంత్‌కు ఎవరు చెప్పారని ధర్మపురి ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు దూరంగా వున్నామంటూ అసదుద్దీన్ ఒవైసీ చెప్పడం విడ్డూరంగా వుందని.. కారు స్టీరింగ్ ఇప్పటికీ ఎంఐఎం చేతిలో వుందని అర్వింద్ ఆరోపించారు. 

ALso Read: కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను టార్గెట్ చేసిన నరేంద్ర మోడీ

అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. మంగళవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కుటుంబ రాజకీయాలపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కుమార్తె బాగుపడాలంటే మీ ఓటు బీఆర్ఎస్‌కు వేయాలన్నారు. అదే మీ కుటుంబం బాగుండాలంటే మీ ఓటు బీజేపీకి వేయాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సంబంధం లేకపోయినప్పటికీ మోడీ బిఆర్ఎస్ మీద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బిజెపి గ్రాఫ్ పడిపోయిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?