కల్వకుంట్ల కవితకు వరుసగా రెండో షాక్: నిజామాబాదు కార్పొరేషన్ పై ఉత్కంఠ?

By telugu teamFirst Published Jan 25, 2020, 3:13 PM IST
Highlights

మునిసిపల్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఏకపక్షంగా సాగుతున్నప్పటికీ... ప్రతిపక్షాలు అధికార తెరాస కు వారు బలంగా ఉన్నచోట బలమైన షాకులను ఇస్తూనే ఉన్నారు. తాజాగా నిజామాబాదు పరిధిలో బీజేపీ తెరాస కు ఓపెన్ సవాలు విసిరి ప్రస్తుతానికి అయితే సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే సూచనలు కనబడుతున్నాయి. 

మునిసిపల్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఏకపక్షంగా సాగుతున్నప్పటికీ... ప్రతిపక్షాలు అధికార తెరాస కు వారు బలంగా ఉన్నచోట బలమైన షాకులను ఇస్తూనే ఉన్నారు. తాజాగా నిజామాబాదు పరిధిలో బీజేపీ తెరాస కు ఓపెన్ సవాలు విసిరి ప్రస్తుతానికి అయితే సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే సూచనలు కనబడుతున్నాయి. 

మొత్తంగా 60 డివిజన్లు కలిగిన నిజామాబాదు లో మేయర్ పదవిని దక్కించుకోవడానికి మేజిక్ ఫిగర్ 31. ప్రస్తుతానికి ఇంకో 13 వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల్లో తెరాస 13 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 21 స్థానాలతో దూసుకుపోతుంది. ఎంఐఎం కూడా 13 సీట్లను గెలిచింది. 

ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పుడు మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకోబోతున్నారనేదానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. మిం మద్దతుతో మేయర్ పదవిని దక్కించుకునేందుకు తెరాస పావులు కదుపుతోంది. ఇంకో 13 వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉంది. 

ఈ నేపథ్యంలో తెరాస గతంలో మాదిరిగానే మిం మద్దతు కోరేందుకు సిద్ధపడుతుంది. 2014లో సైతం ఇక్కడ ఎంఐఎం మద్దతుతో తెరాస మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఈసారి కూడా అదే ఫార్ములాను ప్రయోగించి నిజామాబాదు ను కైవసం చేసుకోవాలని తెరాస ఉవ్విళ్లూరుతోంది. 

ఇకపోతే గత పార్లమెంటు ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ కవితను పట్టుబట్టి రైతులంతా ఒక్కటయ్యి ఏదో యుద్ధమన్నట్టుగా తమ శక్తులన్నీ క్రోడీకరించి ఓడించారు రైతులు. 

అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానని, కవితపై తిరుగుబాటు చేసేలా రైతులను ఉసిగొల్పిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇప్పుడు కోటి ఆశలు పెట్టుకున్న రైతుల నీళ్లు చల్లాడు కాబట్టి ఈ సారి బీజేపీ గెలవడం కష్టం అని భావించారందరు. కానీ అనూహ్యంగా మరో మారు అక్కడ బీజేపీ దూసుకుపోతుండడం విశేషం. 

click me!