అమ్మాయిలను చెరపట్టి లైంగికదాడి: దొంగ బాబా ఉచ్చులో నిజాామాబాద్ యువతి

By telugu teamFirst Published Feb 29, 2020, 10:53 AM IST
Highlights

దొంగ బాబా వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఉచ్చులో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ అమ్మాయి కూడా చిక్కుకుంది. ఆమె కోసం తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆమె ఇంటికి రావడానికి నిరాకరించింది.

న్యూడిల్లీ: అమ్మాయిలను చెరపట్టి, ఆశ్రమాల్లో నిర్బంధించడమే పనిగా పెట్టుకున్న దొంగ బాబా వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఉచ్చులో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి కూడా పడింది. 2015లో సంతోషి రూప అనే అమ్మాయి అతని ఉచ్చుకు చిక్కింది. 

నిజామాబాద్ జిల్లాకు చెందిన దుంపల రాంరెడ్డి, మీనవతి దంపతుల కూతురు ఆమె. అనంతపురం జేఎన్టీటీయులో కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నత విద్యాభ్యాసం కోసం సంతోషి రూప అమెరికా వెళ్లారు. అక్కడ ఓ యూనివర్శిటీలో కెమికల్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ చేశారు. 

నానో టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్న అమె అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. దాంతో తల్లిదండ్రులు ఆమె కోసం ఆరా తీశారు. దాంతో తన కూతురు ఢిల్లీలోని వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఆశ్రమంలో ఉన్నట్లు తెలిసింది. దాంతో వారు అక్కడికి వెళ్లారు. ఆమెను కలవడానికి ఆశ్రమానికి చెందినవారు తండ్రికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇంటికి రావాలని తండ్రి బతిమాలినా సంతోషి రూప వినిపించుకోలేదు. పలుమార్లు వెళ్లి బతిమిలాడినా ఆమె వినలేదు.

Also Read: అతని చెరలో 168 అమ్మాయిలు: బంధించి లైంగిక దాడి చేయడమే...

మరోసారి 2017లో తన కూతురును కలుసుకోవడానికి ఆశ్రమానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ రాజస్థాన్ కు చెందిన పలువురు గొడవ చేస్తూ కనిపించారు. మైనర్లయిన తమ కూతుళ్లను తీసుకుని వచ్ిచ ఆశ్రమంలో బంధించారని వారు మహిళా కమిషన్ ను, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో ఆశ్రమాన్ని తనిఖీ చేసి అమ్మాయిలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు 

తనిఖీల్లో ఇంజక్షన్లు, కొన్ని రకాల మందులు లభించాయి. దాంతో తీవ్రంగా ఆందోళన చెందిన రాంరెడ్డి దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. సంతోషి రూప అమెరికా నుంచి వచ్చేనాటికి బ్యాంక్ ఖాతాలో కోటి రూపాయలు ఉన్నాయని, ఆ డబ్బుు ఆశ్రమం కాజేసి ఉంటుందని రాంరెడ్డి దంపతుల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టులో చెప్పారు. 

ఆశ్రమంలో చేరిన సంతోషి రూప సన్యాసిలా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులు కలిసినప్పుడు తాను దేవతనవుతానని, మీరంతా త్వరలో మరణిస్తారని, మళ్లీ తాము మానవ జాతిని సృష్టించి విశ్వాన్ని నెలకొల్పుతామని, మీరు ఇక్కడి నుంచి వెళ్లండని, తన కోసం మళ్లీ రావద్దని సంతోషి రూప చెబుతూ వచ్చారు. 

click me!