రూ.17కోట్లు పలికిన నిజాం డైమండ్ నెక్లెస్

By telugu teamFirst Published Jun 21, 2019, 11:36 AM IST
Highlights

నిజాం రాజులకు చెందిన నగలకు డిమాండ్ ఇప్పటికీ తగ్గలేదు అనడానికి ఇదే నిదర్శనం. నిజాం నవాబులతోపాటు, దేశంలోని పలు సంస్థానాల పాలకులకు చెందిన నగలను, కళకృతులను వేలం వేశారు. 

నిజాం రాజులకు చెందిన నగలకు డిమాండ్ ఇప్పటికీ తగ్గలేదు అనడానికి ఇదే నిదర్శనం. నిజాం నవాబులతోపాటు, దేశంలోని పలు సంస్థానాల పాలకులకు చెందిన నగలను, కళకృతులను వేలం వేశారు. క్రిస్టీస్ సంస్థ న్యూయార్క్‌లో వీటిని భారీ ధరకు అమ్మేసింది. 

‘మహారాజాస్‌ అండ్‌ మొగల్‌ మాగ్నిఫికెన్స్‌’ పేరుతో  400 నగలను వేలం వేశారు. నిజాం నవాబులకు చెందిన రివిరీ వజ్రాల హారం 24.15 లక్షల డాలర్ల(రూ. 17కోట్లు) భారీ ధర పలికింది. ఇందులో 33 వజ్రాలు ఇన్నాయి. దీనికి రూ. 10 కోట్లు మాత్రమే వస్తాయని భావించగా, మరో 7 కోట్లు అదననంగా దక్కాయి.

 నిజాం రాజులు వాడిన ఓ కత్తి రూ. 13 కోట్లకు అమ్ముడుబోయింది. తమిళనాడులోఆర్కాట్‌ నవాబులు వాడిన 17 క్యారెట్ల గోల్కొండ వజ్రం ‘ఆర్కాట్‌ 2’  అత్యధికంగా రూ. 23.5 కోట్ల ధర పలికింది. జైపూర్‌ రాజులకు చెందిన వజ్రపుటుంగరాన్ని రూ. 4.45 కోట్లు, ముత్యాలహారానికి రూ. 11.8 కోట్లకు కొన్నారు.

click me!