అమెరికా రోడ్లకు ధీటుగా తెలంగాణ రోడ్లు: హైద్రాబాద్‌లో జాతీయ రహదారుల ప్రారంభోత్సవంలో నితిన్ గడ్కరీ

Published : Apr 29, 2022, 02:07 PM ISTUpdated : Apr 29, 2022, 03:29 PM IST
అమెరికా రోడ్లకు ధీటుగా తెలంగాణ రోడ్లు: హైద్రాబాద్‌లో జాతీయ రహదారుల ప్రారంభోత్సవంలో నితిన్ గడ్కరీ

సారాంశం

అమెరికా రోడ్లకు ధీటుగా తెలంగాణలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.  జాతీయ రహదాల ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనల కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.  

హైదరాబాద్:అమెరికా రోడ్లకు ధీటుగా Telangana రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. శుక్రవారం నాడు రాష్ట్రంలోని రెండు National highway లను ప్రారంభించి జాతికి అంకింతం చేశారు.. అనంతరం 7వేల 853 కోట్ల తో మొత్తం 354 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న 10 జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపనలు చేశారు. 

శంషాబాద్ లోని జీఎంఆర్ గార్డెన్స్ లో  ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో కేంద్ర మంత్రి Nitin Gadkari  ప్రసంగించారు. తెలంగాణ నుండి ఐదు ఎక్స్ ప్రెస్ హైవేలు వెళ్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.అన్ని జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నామని గడ్కరీ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకుతో హైద్రాబాద్ నగరానికి మంచినీటి సమస్య పరిష్కారం కానుందని ఆయన చెప్పారుతెలంగాణ శక్తిశాలి అయితేనే భారత్ కూడా శక్తిశాలి కానుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రగతి శీల సంపన్న రాజ్యమని ఆయన చెప్పారు. నీరు, విద్యుత్, రహదారులు, కమ్యూనికేషన్లు ఉంటేనే అభివృద్ది సాధ్యమని నితిన్ గడ్కరీ చెప్పారు. హైద్రాబాద్ రీజినల్ రిండ్ రోడ్డు డీపీఆర్ పూర్తైందన్నారు. ఇది ట్రైలర్ మాత్రమేనన్నారు  సినిమా ఇంకా మిగిలే ఉందని గడ్కరీ చమత్కరించారు.  హైద్రాబాద్ రీజినల్ రిండ్ రోడ్డు శంకుస్థాపనకు మరో మూడు మాసాల్లో తాను హైద్రాబాద్ కు వస్తానని నితిన్ గడ్కరీ చెప్పారు.  రీజినల్ రింగ్ రోడ్డు కోసం భూ సేకరణ చేయాలని గడ్కరీ కోరారు. హైవేల వెంట లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయాలని కూడా మంత్రి సూచించారు.

2014 నుండి 2018 వరకు తెలంగాణలో 4996 కి.మీ. జాతీయ రహదారులు నిర్మించిన విషయాన్ని గడ్కరీ గుర్తు చేశారు. దేశంలో 26కిగా ను తెలంగాణలో ఐదు గ్రీన్ ఎక్స్ ప్రెస్ హైవేలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం  3 లక్షల కోట్లు ఖర్చు చేశామని ఆయన చెప్పారు. ఐదువేల  కోట్లతో హైద్రాబాద్ విశాఖపట్టనం హైవే, నాగపూర్ విజయవాడ హైవే కోసం రూ. 12 వేలు కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు