నాగార్జునసాగర్‌లో రేవంత్ టూర్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు: ఆరా తీసిన ఎఐసీసీ, వీడియో పంపిన పీసీసీ

By narsimha lode  |  First Published Apr 29, 2022, 1:47 PM IST

నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ పార్టీ సన్నాహాక సమావేశం విషయమై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎఐసీసీ ఆరా తీసింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ లను  పార్టీ నాయకత్వానికి బోస్ రాజు పంపారు.



 హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని Nagarjuna Sagar లో టీపీసీసీ చీఫ్ Revanth Reddy సమావేశం నిర్వహించవద్దని  Congress  పార్టీ స్టార్ క్యాంపెయినర్ Komatireddy Venkat Reddy  చేసిన వ్యాఖ్యలపై ఎఐసీసీ ఆరా తీసింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ ను  ఎఐసీసీ సెక్రటరీ బోస్ రాజు పార్టీ నాయకత్వానికి పంపారు.

Nalgonda లో రేవంత్ రెడ్డి సమావేశం అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది మే 6న Warangal లో Rahul Gandhi సభ కు జన సమీకరణకు గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తన వంటి ఫహిల్వాన్ లాంటి నేతలు ఉన్నారని ఆయన చెప్పారు. పార్టీ బలహీనంగా ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటించాలని ఆయన సూచించారు. 

Latest Videos

undefined

నాగార్జునసాగర్ సమావేశం కంటే మూడు రోజుల ముందే నల్గొండలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం గురించి తమకు సమాచారం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, Uttam kumar Reddy లు సమావేశాన్ని రద్దు చేయించారు. ఈ విషయమై Jana Reddy తో చర్చించారు. అయితే పీసీసీ చీఫ్ ను జిల్లా పర్యటనకు రాకుండా అడ్డుకోవడం సమంజసమా అని జానారెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు నాగార్జునసాగర్ లోనే జానారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.

అయితే కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటనకు తాను వెళ్తున్నందున నాగార్జునసాగర్ టూర్ కి తాను హాజరు కాబోనని రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మేసేజ్ పంపారు. ఇదిలా ఉంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించొచ్చని ఎఐసీసీ సెక్రటరీ బోస్ రాజ్ తేల్చి చెప్పారు.ఎవరి అనుమతిని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. 

click me!