గేట్ 2022 లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థి...!

Published : Mar 18, 2022, 09:47 AM ISTUpdated : Mar 18, 2022, 09:48 AM IST
గేట్ 2022 లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థి...!

సారాంశం

వ‌రంగ‌ల్‌లోని నిట్‌లో కెమిక‌ల్ ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న సందీప్ రెడ్డిని నిట్ సంచాల‌కులు ర‌మ‌ణారావు ప్ర‌త్యేకంగా అభిందించారు. 

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల రిక్రూట్ మెంట్ కమ్ అడ్మిషన్ ల కోసం నిర్వహించే ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)’ 2022 తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.  ఆల్ ఇండియా మొదటి, తొమ్మిదవ ర్యాంకు మన తెలుగు విద్యార్థులు సాధించడం గమనార్హం.

గురువారం విడుద‌లైన గేట్ ఫ‌లితాల్లో ఆలిండియా టాప్ ర్యాంకును తెలంగాణ‌కు చెందిన మ‌ణి సందీప్ రెడ్డి కైవ‌సం చేసుకున్నాడు. వ‌రంగ‌ల్‌లోని నిట్‌లో కెమిక‌ల్ ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న సందీప్ రెడ్డిని నిట్ సంచాల‌కులు ర‌మ‌ణారావు ప్ర‌త్యేకంగా అభిందించారు. హైదరాబాద్​కు చెందిన మణి సందీప్ వరంగల్ నిట్​లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 

అతని తండ్రి హైదరాబాద్ లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు, కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ హెచ్​వోడీ డా. శ్రీనాథ్, ప్రొఫెసర్ శిరీశ్ సోన్​వానే, నిట్ ప్రొఫెసర్లు మణి సందీప్ రెడ్డిని అభినందించారు.

అదే విధంగా ... మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా తొర్రూరు మండ‌లం చీక‌టాయ‌పాలేనికి చెందిన మ‌రో విద్యార్థి త‌న్నీరు నిరంజ‌న్‌కు మెట‌లర్జిక‌ల్ ఇంజినీరింగ్‌లో 9 వ ర్యాంకు ద‌క్కింది. నిరంజన్ తండ్రి శ్రీనివాస్ ప్రైవేట్ లెక్చరర్ కాగా, తల్లి నిర్మల తొర్రూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్​గా పని చేస్తున్నారు. నిరంజన్ మహారాష్ట్రలోని రూర్కీ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడని తల్లిదండ్రులు తెలిపారు.  గేట్ 2022 ఫలితాలను ఐఐటీ ఖరగ్ పూర్ గురువారం విడుదల చేసింది. 

 ఇటీవ‌లి కాలంలో గేట్‌లో తెలుగు విద్యార్థులు స‌త్తా చాటుతున్నా.. ఈ ద‌ఫా ఏకంగా ఆలిండియా ఫ‌స్ట్ ర్యాంకు తెలుగు విద్యార్థికి దక్క‌డం గ‌మ‌నార్హం.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!