
మిర్యాలగూడ : దామరచర్ల మండల కేంద్రంలో ఇటీవల చోటు చేసుకున్న వంట మాస్టర్ murder చిక్కుముడి వీడుతున్నట్లు తెలుస్తోంది. దామరచర్ల కు చెందిన కుర్ర లింగరాజు (38) ఈనెల 12వ తేదీన రాత్రి మండల కేంద్రంలోని Railway tracks పక్కన దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు దామరచర్ల కు చెందిన లింగరాజుకు అదే ప్రాంతానికి చెందిన మల్లీశ్వరి తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. లింగరాజు మండల కేంద్రంలోని గిరిజన Gurukul schoolలోకాంట్రాక్టు పద్ధతిలో cookIng masterగా పని చేస్తున్నాడు.
కాగా, లింగరాజు మద్యానికి బానిస గా మారి అనుమానంతో మల్లీశ్వరిని వేధిస్తూనే వాడు. అతడి ప్రవర్తన తో విసుగు చెందిన మల్లేశ్వరి, తన సోదరుడు వెంకటేష్తో కలిసి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. లింగరాజు అడ్డు తొలిగితే వచ్చే ఆస్తి, ఉద్యోగాలతో సుఖంగా జీవించాలన్న ఉద్దేశంతో అతడి భార్య మల్లేశ్వరి, ఆమె సోదరుడు వెంకటేష్ పథకం ప్రకారమే మరో ఇద్దరి సహకారంతో ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది.
ఆ రాత్రి ఏం జరిగింది ?
లింగరాజు రోజు మాదిరిగానే 12వ తేదీ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వంట వండి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న లింగరాజు ఇంటికి వచ్చాక మల్లీశ్వరి తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య కుటుంబ వ్యవహారాల పై తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. ఆ తర్వాత లింగరాజు తొమ్మిది గంటల ప్రాంతంలో మళ్లీ మద్యం తాగేందుకు బయటకు వెళ్లినట్లు తెలిసింది.
ఆత్మహత్యగా చిత్రీకరించాలని…
అయితే, ఇదే క్రమంలో లింగరాజు భార్య మల్లేశ్వరి ఇంట్లో గొడవ గురించి సోదరుడు వెంకటేష్ కు ఫోన్ చేసి వివరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు కలిసి లింగరాజు హత్య చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే ప్రాంతానికి చెందిన మల్లీశ్వరి సోదరుడు వెంకటేష్ మరో ఇద్దరితో కలిసి లింగరాజు వద్దకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఇంటి సమీపంలోనే రైల్వే ట్రాక్ పక్కన మల్లేశ్వరి, లింగరాజు, వెంకటేష్, వెంట వచ్చిన రాజు గట్టు కు చెందిన డ్రైవర్, హాస్టల్ లో పనిచేసే మరో వ్యక్తి సమావేశమయ్యారు. అక్కడే మద్యం తాగుతూ గొడవలు పడితే పరువు పోతుందని లింగరాజు సత్య చెప్పే ప్రయత్నం చేశారు.
అప్పటికే హత్య చేయాలని నిర్ణయించుకున్న వెంకటేష్ ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో లింగరాజు గొంతుకోశాడు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని రైలు పట్టాలపై వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పథకం రచించారు. అయితే అర్ధరాత్రి దాటిన సమయంలో సమీప కాలనీవాసులు, ఇసుక ట్రాక్టర్లు తిరుగుతుండడంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది.
పోలీస్ జాగిలాలు అక్కడి వరకే…
హత్యోదంతం వెలుగుచూడటంతో పోలీసు జాగిలాల్ని రప్పించారు. మృతదేహం పడి ఉన్న కొద్ది దూరంలో ఉన్న నల్ల వద్దకు వెళ్లి జాగిలం ఆగిపోయింది. అక్కడే రెండు మద్యం బాటిల్ లు కూడా పోలీసులకు దొరికాయి. మద్యం తాగిన తర్వాత లింగరాజు హత్య చేసి ఉంటారని అందుకు ఉపయోగించిన పదునైన ఆయుధం ని అక్కడే నళ్లా దగ్గర శుభ్రం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
లోతుగా పోలీసుల విచారణ…
లింగరాజు అతడి భార్య, బావమరిది హత్య చేశారని ఆరోపిస్తూ అతడి సోదరుడు చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దిశగానే పోలీసులు లింగరాజు భార్య మల్లేశ్వరి, ఆమె సోదరుడు వెంకటేశం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరో వ్యక్తి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, లింగరాజు ను హత్య చేయడానికి గల బలమైన కారణాలు ఏమిటి? హత్యోదంతం లో సూత్ర సూత్రధారులు వెంకటేష్, మల్లీశ్వరి నేనా? అతడి వెంట వెళ్ళిన మరో ఇద్దరు కూడా పాత్రధారులైన? ఈ మొత్తం వ్యవహారంలో లింగరాజు భార్య మల్లేశ్వరి పాత్ర ఎంతో మేరకు ఉంది? ఇలా పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, పోలీసులు ఒకటి రెండు రోజుల్లో హత్యోదంతం కేసు చిక్కుముడి విప్పి నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టి కోర్టులో హాజరు కానున్నట్లు తెలుస్తోంది.