హోటల్‌లో భోజనానికి మున్సిపల్ కమీషనర్.. చికెన్ బిర్యానీ తింటుండగా బొద్దింక ప్రత్యక్షం, తనిఖీల్లో వాస్తవాలు

Siva Kodati |  
Published : Aug 03, 2021, 07:42 PM IST
హోటల్‌లో భోజనానికి మున్సిపల్ కమీషనర్.. చికెన్ బిర్యానీ తింటుండగా బొద్దింక ప్రత్యక్షం, తనిఖీల్లో వాస్తవాలు

సారాంశం

నిర్మల్ జిల్లాలో ఓ హోటల్‌లో చికిన్ బిర్యానీలో బొద్దింక కనిపించింది. ఏకంగా మున్సిపల్ కమీషనర్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన తనిఖీలు చేపట్టగా వాస్తవాలు వెలుగు చూశాయి..  

నిర్మల్ జిల్లాలోని హోటల్స్‌లో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. మున్సిపల్ కమీషనర్ బాలకృష్ణకు ఊహించని పరిస్ధితి ఎదురైంది. భోజనం కోసం శాంతినగర్ క్రాస్ రోడ్‌లోని శ్రీలక్ష్మీ గ్రాండ్ హోటల్‌కు మున్సిపల్ కమీషనర్ తన సిబ్బందితో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో చికెన్ బిర్యానీని ఆర్డర్ చేశారు. వేడి వేడిగా వున్న చికెన్ బిర్యానీ తింటుండగా చికెన్ పీస్‌లతో పాటు బొద్దింక కనిపించింది. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన మున్సిపల్ కమీషనర్ అనుమానం వచ్చి హోటల్ కిచెన్‌ను పరిశీలించారు. ఫ్రిడ్జిలో చికెన్ బూజు పట్టి కనిపించగా.. కిచెన్ వాతావరణమంతా అపరిశుభ్రంగా వుంది. దీంతో హోటల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ కమీషనర్.. ఆ హోటల్‌ను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Prices: ట‌మాట డ‌బుల్‌, సెంచ‌రీ కొట్టిన అల్లం.. హైద‌రాబాద్‌లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.
Mangli Contrevercy: మంగ్లీ కేసులో సిఐడి దూకుడు.. అసలు ఏమిటీ స్కాం..? | Asianet News Telugu