ట్రైనీ ఎస్సైని లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేశారు ఉన్నతాధికారులు. ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషీ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు
ట్రైనీ ఎస్సైని లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేశారు ఉన్నతాధికారులు. ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషీ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, మహిళా ట్రైనీ ఎస్సై మీద అదే స్టేషన్ లో ఎస్ హెచ్ వోగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మరిపెడ పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి జరిగింది.
Also Read:రాత్రి అడవిలోకి తీసుకెళ్లి మహిళ ఎస్సైపై మరిపెడ ఎస్సై బలాత్కారం
సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ పేరుతో మహిళా ట్రెయిని ఎస్సై ని ఒంటరిగా వాహనంలో తీసుకెళ్లాడు ఎస్ హెచ్ వో శ్రీనివాస్ రెడ్డి. దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ అధికారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఆమె బయటపడింది. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి వరంగల్ కమిషనర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేసింది. దళిత యువతి కావడమే తమ బిడ్డ చేసిన పాపమా అంటూ ఆ ట్రైనీ ఎస్సై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటన మీద తనకు న్యాయం జరగకుంటూ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని దళిత ఎస్సై ట్రైని చెబుతోంది.