ఇంద్రకరణ్ రెడ్డికి షాక్: నిర్మల్ ఛైర్మెన్, కౌన్సిలర్లు టీఆర్ఎస్‌కు రాజీనామా

Published : Oct 14, 2018, 05:24 PM IST
ఇంద్రకరణ్ రెడ్డికి షాక్: నిర్మల్  ఛైర్మెన్, కౌన్సిలర్లు టీఆర్ఎస్‌కు రాజీనామా

సారాంశం

ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలోని  నిర్మల్  ఎమ్మెల్యే  ఇంద్రకరణ్ రెడ్డికి నిర్మల్ మున్సిఫల్ ఛైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి షాకిచ్చారు


నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలోని  నిర్మల్  ఎమ్మెల్యే  ఇంద్రకరణ్ రెడ్డికి నిర్మల్ మున్సిఫల్ ఛైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి షాకిచ్చారు.గణేష్ చక్రవర్తితో పాటు 17 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు.

2014 ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీ నుండి  పోటీ చేసి  విజయం సాధించారు. అయితే  ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇంద్రకరణ్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. 

తర్వాత కేసీఆర్ మంత్రివర్గంలో ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు.  నిర్మల్ మున్సిఫల్ ఛైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తితో పాటు 17 మంది కౌన్సిలర్లు టీఆర్ఎస్‌కు  రాజీనామా చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు ఎంఐఎం కౌన్సిలర్లు  కూడ రాజీనామా చేశారు.

అప్పాల గణేష్ చక్రవర్తికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి మధ్య  అంతరం ఏర్పడింది.  దీంతో గణేష్ చక్రవర్తి  టీఆర్ఎస్ కు రాజీనామా చేశారని అంటున్నారు.

గణేష్ చక్రవర్తి, మరికొంతమంది కౌన్సిలర్లు  టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. గణేష్ చక్రవర్తితో పాటు కౌన్సిలర్లు   కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.  ఆదిలాబాద్ జిల్లాలో జరిగే  రాహుల్ సభలో  వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌